శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - May 09, 2020 , 22:31:02

వంటింట్లో లభించే పదార్థాలతో వాటిని నివారించొచ్చు...

 వంటింట్లో లభించే పదార్థాలతో వాటిని నివారించొచ్చు...


 వంటింట్లో లభించే పదార్థాలతోనే చిన్న చిన్న అనారోగ్యాలకు చికిత్స చేసుకోవచ్చు. లేత బీరకాయ వేపుడు తీవ్రమైన జ్వరం వచ్చి, తగ్గిన వారికి చాలా మంచిది. నెలసరి నొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను నీళ్లలో వేసి మరిగించి వడకట్టి ఆ నీటిని సేవించడం వల్ల ఫలితం ఉంటుంది.పుదీనా ఆకులు, ఉప్పు కలిపి, నీటిలో మరిగించి, ఆవిరి పడితే గొంతు మృదువుగా మారుతుంది. ఉసిరి పచ్చడి, తేనెలో నానపెట్టిన ఉసిరి రోజూ పద్ధతి ప్రకారం సేవిస్తే దృష్టి లోపం తగ్గుతుంది. అలాగే ఉసిరి పొడిని నిత్యం పరగడుపున తేనెతో కలిపి సేవించడం మంచిది. దీనివల్ల వత్తిడి, అలసట తగ్గుతుంది. ఎండుద్రాక్షలు, కిస్‌మిస్‌లు వాడడం మంచిది. వీటికి చలువ చేసే గుణం ఉంది. రాత్రి గ్లాసుడు నీళ్లలో ఎండు ద్రాక్షలు నానపెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే చాలా మంచిది. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎంతో మేలు చేస్తుంది. అరటిపండు, తేనెతో కలిపి తీసుకుంటే క్షయ వ్యాధిగ్రస్తులకు మంచిది.నేరేడు ఆకులు నీటిలో మరిగించి, వడగట్టి, ఆ నీటిని పుక్కిలిస్తే నోటిపూతలు తగ్గుతాయి. వేప చెట్టు బెరడును పెనంపై బాగా కాల్చి, మెత్తగా పొడి చేయాలి. ఆ పొడికి కొద్దిగా కొబ్బరినూనె కలిపి, కురుపులపై రాస్తే ఉపశమనం లభిస్తుంది.  


logo