శనివారం 11 జూలై 2020
Health - May 05, 2020 , 21:23:38

విశిష్ట గుణాల నేరేడు

 విశిష్ట గుణాల నేరేడు


  పోషకాలను అందించే నేరేడు సుగుణాల గురించి ఎంతచెప్పినా తక్కువే. నేరేడు చెట్టు వేరు మొదలు చిగుళ్ళవరకు అణువణువూ ఔషధభరితమే. ఆరోగ్య పరిరక్షణలో నేరేడు ఎంతో ఉపయోగపడుతుంది ...నేరేడు పండ్ల వినియోగంతో రక్తహీనత దరిజేరదు. రక్తశుద్ధి కూడా జరుగుతుంది. జిగట విరేచనాల బాధితులు 3 చెంచాల నేరేడు రసం తాగినా లేదా నీటిలో నేరేడు బెరడు కషాయం, తేనె, చక్కెర కలిపి తాగినా సమస్య దారికొస్తుంది. నీరసం కూడా తగ్గుతుంది. నేరేడులో పిండి పదార్థాలు, కొవ్వు బహుస్వల్పంగా ఉంటాయి గనుక దీన్ని ఊబకాయులు, మధుమేహులు కూడా నిరభ్యంతరంగా తినొచ్చు. మధుమేహులు నేరేడు గింజల పొడిని నీటిలో కలుపుకు తాగితే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకివస్తాయి. గ్యాస్‌, అజీర్తి సమస్య ఎదురై అసౌకర్యంగా ఉంటే, పండిన నేరేడు పండ్లు తింటే ఉపశమనం కలుగుతుంది. నేరేడులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు, గుండె ఆరోగ్యానికి రక్షగా నిలుస్తాయి. రక్తక్యాన్సర్‌ కారకాలను కూడా నిరోధిస్తాయి.అధిక జ్వర బాధితులు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.నేరేడు పండ్లు తింటే కాలేయ సంబంధిత సమస్యలు తొలగిపోయి కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.నేరేడు ఆకుల కషాయం తాగితే .. బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. నేరేడు ఆకుల కషాయంతో నోరు పుక్కిలిస్తే పంటినొప్పి, చిగురువాపు, నోట్లో పుండ్లు, నోటి దుర్వాసన వంటి సమస్యలు దూరమవుతాయి.


logo