శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Apr 27, 2020 , 22:08:04

మల్లెలతో ప్రయోజనాలెన్నో...

మల్లెలతో ప్రయోజనాలెన్నో... వేసవి సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. సౌందర్య పోషణలోనూ మల్లెపూలు ఎంతగానో దోహదపడతాయి. మల్లెలు అందించే సౌందర్య ప్రయోజనాలు..
రోజంతా బయట తిరిగటం వల్ల ఒత్తిడికి లోనైన కళ్ళమీద విరిసిన మల్లెలను ఉంచితే ఆ ఒత్తిడి తొలగిపోతుంది.చుండ్రు బాధితులు మెంతులు, ఎండుమల్లెలు కలిపి నూరి తలకు పట్టిస్తే సమస్య తగ్గడమే కాక జుట్టు పట్టు కుచ్చులా మెరిసిపోతుంది.రెండు చెంచాల చొప్పున మల్లెపూల రసం, గులాబీ పువ్వుల రసం, గుడ్డు పచ్చ సొన   కలిపి ముఖానికి రాస్తే ముఖ చర్మం మెత్తబడి కాంతివంతంగా మారుతుంది. 
మత్తెక్కించే మల్లెపూల వాసన నాడీవ్యవస్థను ప్రేరేపించి శృంగారపరమైన కోర్కెలను పెంచుతుంది. మల్లెల నూనెను మొటిమల మచ్చల మీద రాసి ఇంకేలా మర్దనా చేస్తే ఆ మచ్చలు చర్మం రంగులో కలిసిపోతాయి.
మల్లెపూల నూనె, లావెండర్‌ ఆయిల్‌ కలిపి ఒళ్ళంతా మర్దనా చేస్తే శారీరక అలసట తొలగటమే కాక, మానసిక ఒత్తిడి, కుంగుబాటు దూరమవుతాయి.
 మల్లెపూలు నీటిలో వేసుకొని గంట తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే శరీరం, మనసు తేలికపడతాయి. పూల సువాసనతో ఒళ్ళు గుబాళిస్తుంది. మల్లెపువ్వులను కొబ్బరినూనెలో వేసి రాత్రంతా నానబెట్టి, ఆ తర్వాత మరగనిచ్చి ఆ నూనెను జుట్టుకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యంగా పెరగటమే గాక మాడు చల్లబడుతుంది. గుప్పెడు విచ్చిన మల్లెల్ని నూరి ముద్దచేసి కొద్దిగా పాలు కలిపి ముఖమంతా మర్దన చేసుకొని ఆ తర్వాత అరచెంచా చొప్పున ముల్తానామట్టి, గంధం, తేనె కలిపి పేస్ ప్యాక్ వేసుకొంటే చర్మం తాజాగా మారి మెరిసిపోతుంది.


logo