శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Apr 23, 2020 , 00:54:10

బొప్పాయి లో బోలెడు పోషకాలు

బొప్పాయి లో బోలెడు పోషకాలు


   మెరిసే చర్మం, ఆరోగ్యవంతమైన శిరోజాలు కోరుకునే వారికి బొప్పాయి వరమనే చెప్పాలి. సౌందర్య పోషణలో మరీ ముఖ్యంగా చర్మ సౌందర్య పరిరక్షణకు బొప్పాయి  ఎలా ఉపకరిస్తుందంటే...
గుప్పెడు చొప్పున బొప్పాయి గుజ్జు, అరటి పండు గుజ్జు, పెరుగు కలిపి దానికి చెంచా కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించి టవల్ చుట్టి గంట ఆగిన తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టు మెరుస్తుంది. తరచూ బొప్పాయి గుజ్జు ముఖం, మెడకు రాసుకొంటే అందులోని విటమిన్ ఏ వల్ల చర్మంపై ఉండే మృతకణాలను తొలగించి చర్మం మెరుపులీనుతుంది.
వెన్న, బొప్పాయి గుజ్జు కలిపి కళ్ల చుట్టూ రాసుకొని ఆరనిచ్చి కడిగితే కంటికింది నల్లని మచ్చలు, వలయాలు పోతాయి.
బొప్పాయి గుజ్జు తేనె కలిపిన మాస్క్ వాడేవారు ముఖం సహజమైన మెరుపును సంతరించుకొంటుంది.
గాయాలు, మొటిమలు, పొక్కుల మూలంగా ఏర్పడిన మచ్చలున్న వారు పచ్చి బొప్పాయి గుజ్జును రాస్తే ఆ మచ్చలు మాయమవుతాయి.
అరికాళ్ళ, మడమల పగుళ్లకు బొప్పాయి గుజ్జు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
వారంలో కనీసం 3 రోజులు బొప్పాయి తినే వారికి జుట్టు రాలే సమస్య ఉండదు.


logo