శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Apr 15, 2020 , 23:56:08

వేసవిలో ఎటువంటి దుస్తులు ధరించాలి?

వేసవిలో ఎటువంటి దుస్తులు ధరించాలి?


  వేసవి వచ్చేసింది. ఈ సీజన్లో మండే ఎండ, ఊపిరి సలపనీయని ఉక్కపోతల ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే ప్రత్యేకమైన దుస్తులు ధరించాలి . ఇవి సౌకర్యంగా ఉండటంతో పా టు ట్రెండీగా , సొగసునూ తెచ్చిపెడతాయి. వేసవి దుస్తుల ఎంపికలో  ఏ యే అంశాలనుపరిగణలోకి తీసుకోవాలంటే.. వేసవిలో నూలు(కాటన్) దుస్తులు మంచిదే. అయితే మహిళలు మరీ ఏ డిజైన్ లేని సాదా దుస్తులను ఇష్టపడరు గనుక వారు ప్రింటెడ్ కాటన్ దుస్తులు ఎంపిక చేసుకోవాలి. ఇలాంటివారికి పగటి ఎండధాటికి నిలిచి, చెమటను పీల్చుకొనే లినన్‌ కాటన్‌, ఆర్గంజ, వంటివి మంచి ఎంపిక అని చెప్పొచ్చు. అదే.. సాయంత్రం వేళ కశ్మీరీ సిల్క్‌, మట్క సిల్క్‌, క్రేప్‌ సిల్క్‌ వంటివైతే సౌకర్యంగా ఉండటంతో బాటు అందంగానూ కనిపిస్తారు. గృహిణులు ఫ్రింటెడ్‌ కాటన్‌ చీరలతో బాటు లినన్‌, హ్యాండ్‌లూమ్‌, కోట రకం చీరలు ఎంపిక చేసుకోవచ్చు. వేసవిలో ఏదైనా విందులకు వెళ్లాల్సిన సందర్భాల్లో చందేరి సిల్క్‌ బాగుంటుంది. అయితే.. బ్రొకేడ్స్‌, వెల్వెట్ ల జోలికిపోవద్దు.కాలేజీ యువతులు, ఉద్యోగినులు సాదా కాటన్ కుర్తాలతో బాటు ఫ్రింటెడ్‌ బాటమ్‌తో వచ్చిన మంగళగిరి కుర్తాలను వాడొచ్చు. ఇంకాస్త భిన్నంగా ఉండాలనుకొంటే వాటికి.. పెద్ద పెద్ద బటన్‌లు, కాలర్ల డిజైన్లు ఎంపికచేసుకోవచ్చు . అయితే.. వేసవిలో లాంగ్‌ సల్వార్లు లేదా కుర్తాల జోలికి పోవద్దు. వేసవిలో నమోదయ్యే పగటి ఉష్ణోగ్రతలను తట్టుకోవాలంటే లేత రంగు దుస్తులు మంచిది. వీటిలో లేత నీలం, లేత గోధుమ రంగు, లేత గులాబీ రంగులైతే మరీ మంచిది. సాయంత్ర వేళలో నారింజ, ముదురు నీలం, చాక్లెట్‌ బ్రౌన్‌ రంగులు ఎంపిక చేసుకోవచ్చు. ఇక.. ‘సీ గ్రీన్‌’ రంగు దుస్తులైతే ఏ సమయంలోనైనా వేసుకోవచ్చు. వేసవి దుస్తులు మరీ వదులుగా లేక బిగుతుగా లేకుండా తగినట్లు ఉండాలి. దీనివల్ల శరీరానికి గాలి తగిలి చెమట పట్టటం తగ్గటమే గాక పట్టిన చెమటను దుస్తులు ఎప్పటికప్పుడు పీల్చుకోవటం సాధ్యమవుతుంది. నిర్వహణ కాస్త కష్టమనిపించినా వేసవిలో మెత్తని నూలు వస్త్రాల ఎంపిక మంచిది. డ్రెస్ కోడ్ పాటించే వారు సైతం కాటన్ జీన్స్, షర్టులు ఎంపిక చేసుకోవచ్చు.


logo