బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Apr 12, 2020 , 00:04:34

నువ్వుల నూనెతో ప్రయోజనాలు

 నువ్వుల నూనెతో ప్రయోజనాలు


 
   నూనె గింజల్లో నువ్వులు ముఖ్యమైనవి. గొప్ప పోషక విలువలున్న కారణంగా వీటిని 'పవర్ హౌసెస్' అంటారు. వేలాది ఏళ్ళ నుంచి ఆహారంలో నువ్వుల వినియోగం ఉంది. ఇక.. వంటకాల్లో నువ్వుల నూనె వినియోగం విస్తృతంగా కనిపిస్తుంది. మెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, కాల్షియం, జింక్, ఐరన్, థయామిన్ మరియు విటమిన్ 'E'ల సమాహారమైన ఈ నూనె అటు ఆరోగ్య పరిరక్షణకు ఇటు సౌందర్య పోషణకు దోహదం చేస్తుంది. ఆయుర్వేదం సైతం దీన్ని అన్నినూనెల్లోకి శ్రేష్టమైనదని చెబుతున్నది.

-నువ్వుల నూనె లోని పోషకాలు జుట్టు రాలటాన్ని నిరోధించటమే గాక కేశాల ఎదుగుదలకు దోహదపడతాయి. అల్ట్రా వైలెట్‌ కిరణాల ప్రభావం జుట్టు మీద పడకుండా చూడటమే గాక చుండ్రును సైతం వదిలిస్తుంది.
-ఈ నూనె లోని విటమిన్ ఈ, బి పలు చర్మ సమస్యల నివారణకు దోహదం చేయటమే గాక దీన్ని ఒంటికి రాయటం వల్ల చర్మం కోమలంగా మారటమే గాక కొత్త మెరుపును సంతరించుకొంటుంది.
నువ్వుల నూనెలో పుష్కలంగా లభించే యాంటీ యాక్సిడెంట్లు చిన్నారుల్లో కొవ్వు స్థాయిని నియంత్రణలో ఉంచటంతో బాటు మాయిశ్చరైజర్‌లాగా పనిచేస్తుంది. స్నానానికి ముందు పసిపిల్లల మాడుకు, ఒంటికి నువ్వులనూనె పట్టించి మర్దన చేయటం వల్ల చర్మం మృదువుగా మారటమే గాక గాక స్నానం తర్వాత హాయిగా నిద్రపడుతుంది.
నువ్వుల నూనె శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.
నువ్వుల నూనె మధుమేహుల రక్తంలోని ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను, రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుంది.
నువ్వులనూనెలోని ఒమెగా-3 ఫాటీ ఆమ్లాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
స్త్రీలలో హార్మోన్ల సమస్యకు ఆహారంలో నువ్వుల, నువ్వుల నూనె వినియోగం చక్కని పరిష్కారం.
ఆహారంలో నువ్వులు, నువ్వులనూనె వినియోగంతో కీళ్లు, ఎముకలు బలోపేతమై కీళ్ళ నొప్పులు, వాపులు తగ్గుతాయి.

తాజావార్తలు


logo