ఆదివారం 07 జూన్ 2020
Health - Apr 10, 2020 , 00:12:47

నల్లద్రాక్ష ప్రయోజనాలు

 నల్లద్రాక్ష ప్రయోజనాలు


ఏ సీజన్లో వచ్చే పండు ఆ సీజన్లో తీసుకోవటం  వలన మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నల్ల ద్రాక్షలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధకతను పెంచడంలో సహాయ పడుతుంది . 
 నల్లద్రాక్ష ప్రయోజనాలు ఎన్నో ....
 ద్రాక్ష రసం  క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల గుండె  కు మేలు చేస్తుంది. 
 అంతేకాదు  హై బీపి అదుపులో ఉంటుంది. -పంచదార కలపకుండా త్రాగడం వలన తలనొప్పి తగ్గుతుంది.-ఈ రసాన్ని తరచూ తీసుకోవడం వలన మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇందులో  విటమిన్ కె , పొటాషియం అధికంగా ఉండటం వలన  చర్మం పొడిబారకుండా చేసి చర్మానికి  మంచి నిగారింపును ఇస్తుంది. -అసిడిటితో బాధపడేవారు రోజూ ఒక గ్లాసు తాజా ద్రాక్షా రసం తాగడం వలన అసిడిటి తగ్గుముఖం పడుతుంది. -ద్రాక్షలో సెల్యులోజ్, ఆర్గానిక్ ఆసిడ్, షుగర్ వంటివి మలబద్ధకాన్ని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందువల్ల మలబద్దకంతో బాధపడేవారు ద్రాక్షను తినడం వల్ల చాలా మేలు జరగుతుంది.-జీవం కోల్పోయిన జుట్టుకు ద్రాక్ష గింజలు చక్కని ఔషధంలా పనిచేస్తాయి. వాటిల్లోని ఫ్యాటీ ఆమ్లాలు శిరోజాలకు పోషణను అందించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి.


logo