సోమవారం 21 సెప్టెంబర్ 2020
Health - Apr 05, 2020 , 15:05:00

ఆకర్షణీయమైన అందం కోసం

  ఆకర్షణీయమైన అందం కోసం


 
మనం చేసుకునే సౌందర్య చిట్కాలన్నీ దాదాపు చర్మానికి నునుపు, తెలుపు తెచ్చేవే. తెల్లగా రావాలని ప్రతి ఒక్కరూ  ఆశిస్తారు. అందుకోసం ఈ చిట్కాలతో మెరుగైన ఫలితాలు పొందొచ్చు
 
    -తేనె పొడిబారిన చర్మానికి, కాలిన మచ్చలపై నా రాసుకోవచ్చు. ఎటువంటి మాచలనైనా తగ్గించే శక్తి తేనె సొంతం.  స్నానానికి పదినిమిషాల ముందు తేనెను శరీరమంతా పట్టించుకొంటే చర్మం కోమలంగా తయారవుతుంది.
 
    -మూడు చెంచాల కొబ్బరి నూనెకు నాలుగు చెంచాల తేనె కలిపి బాగా గిలక్కొట్టి తలకు రాసుకోవచ్చు. పొడిబారిన జుట్టుకి ఇది చక్కని పరిష్కారం. తేనె వల్ల జుట్టు నెరుస్తుందనేది కేవలం అపోహ మాత్రమే.
 
   -చర్మం మరీ పొడిబారితే.. చెంచా తేనెలో సోయా పిండి, కొబ్బరిపాలు రెండుచెంచాల చొప్పున కలిపి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక రుద్దుతూ పూతను తీసేయాలి. ఇలా చేస్తే మోము ప్రకాశవంతంగా మారుతుంది. శరీరానికైతే.. ఈ మిశ్రమాన్నిరెండింతలు కలిపి పూతలా వేసుకుంటే మంచి మార్పుకనిపిస్తుంది.
 
   -ఒక టీ స్పూన్‌ నిమ్మరసంలో కొద్దిగా తేనె, రెండు చుక్కల గ్లిజరిన్‌కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకి ప్రతిరోజూ అప్లై చేస్తూ ఉంటే పెదవులపై ఉన్ననలుపు క్రమంగా తగ్గి, ఆకర్షణీయంగా మారతాయి.


logo