శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Apr 05, 2020 , 12:40:18

ఏపీ లో కొత్తగా 34 కోవిడ్-19 కేసులు

ఏపీ లో కొత్తగా 34 కోవిడ్-19 కేసులు

 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు కేవలం పన్నెండు గంటల వ్యవధిలోనే 34 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దృవీకరించింది. ఇప్పటి వరకు వీటితో కలిపి ఏపీలో 226కు చేరుకున్నట్లు పేర్కొన్నది. కొత్తగా నెల్లూరు -2, ఒంగోలు-2, చిత్తులురు జిల్లాలో -7,కర్నూలు జిల్లాలో 23 కరోనా కేసులు నమోదయినట్లు వైద్యశాఖ తెలిపింది.  


logo