శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Health - Apr 05, 2020 , 10:34:33

తులసితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

 తులసితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో


-తులసికి రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి ఉండటంతో డయాబెటిస్ ఉన్న వారికి ఉపరికరిస్తుంది.
-రెండు స్పూనుల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగితే పైత్యం తగ్గుతుంది.
-తులసి ఆకులను నూరి మొఖానికి రాసుకుంటే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.
-తులసి మొక్కలు నోటిపూత, నోట్లో అల్సర్స్, ఇతర ఇన్‌ఫెక్షన్ల నివారణకు ఎంతో ఉపకరిస్తుంది.
- ప్రధానంగా చిన్నపిల్లల్లో తరచూ వచ్చే దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులకు ఇది ఉపకరిస్తుంది.
-తులసి ఆకులను డికాషన్‌గా తీసుకుని తలనొప్పిని దూరం చేసుకోవచ్చు.
-వీటి ఆకులను ఎండబెట్టి, వాటిని పొడి చేసి, దాంతో పండ్లు తోముకుంటే దంత రక్షణకు ఎంతో ఉపకరిస్తుంది. దీన్ని ఆవనూనెలో కలిపి టూత్‌పేస్ట్‌లా  వాడుకుంటే దంతక్షయంతోపాటు నోటి దుర్వాసన పోయి, పళ్ళు అందంగా తయారవుతాయి.
- రోజూ ఒక తులసి ఆకు తింటే నాడులకు టానిక్‌లాగా, జ్ఞాపకశక్తిని పెంపొందించే శక్తిగా పని చేస్తుంది.
-వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. జ్వరం మరీ ఎక్కువగా ఉంటే తులసి ఆకులనూ, యాలకుల పొడినీ కలిపి అరలీటరు నీళ్లలో మరిగించి కషాయంలా తయారు చేసి అందులో చక్కెర, పాలు కలిపి తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది.
- బ్రాంకైటిస్‌, ఆస్థమాల్లో కఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.
- ప్రతిరోజు ఐదారు ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. కడుపులో నులి పురుగు నశిస్తుంది.
- ఎండిన తులసి ఆకులను కీటకాలను దూరంగా ఉంచడం కోసం ధాన్యం నిలవ చేసే  చోట్ల ఉంచుతారు.
- ఆకుల రసం (పసరు)గా, ఎండిన ఆకుల పొడిగా, హెర్బల్ టీగా, నేతిలో మరిగించడం  ద్వారా… ఇలా తులసిని వివిధ రూపాల్లో తీసుకోవచ్చు.


logo