బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Apr 01, 2020 , 10:09:03

స్టార్టప్ సంస్థ నోవాలీడ్ వెల్లడి

స్టార్టప్ సంస్థ నోవాలీడ్ వెల్లడి

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్‌-19 వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 42 ఔషధాలు సమర్థంగా పనిచేస్తాయని నోవాలీడ్‌ అనే ఫార్మా స్టార్టప్‌ సంస్థ వెల్లడించింది. ప్రభుత్వ ఆమోదం పొందిన 2,100 డ్రగ్స్‌ను పరిశీలించిన ఆ సంస్థ అందులో 42 మెడిసిన్స్‌ కరోనా రోగులకు చేసే వైద్యంలో వివిధ దశల్లో సమర్ధంగా ఉపయోగపడగలవని తెలిపింది. ఈ మందులు ఇప్పటికే ప్రభుత్వ గుర్తింపు పొంది మార్కెట్లో విరివిగా లభ్యమవుతున్నాయి కాబట్టి కరోనా రోగులకు చేస్తున్న వైద్యంలో వెంటనే ఉపయోగించవచ్చు అని కంపెనీ సీఈవో సుప్రీత్‌ దేశ్‌పాండే తెలిపారు. పుణే కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థకు టాటా క్యాపిటల్‌ హెల్త్‌కేర్‌ ఫండ్‌ నిధులను అందిస్తున్నది.


logo