శనివారం 30 మే 2020
Health - Mar 23, 2020 , 22:15:39

రక్తనాళాలకు కష్టమొస్తే..

రక్తనాళాలకు కష్టమొస్తే..

కూర్చున్నా.. నిల్చున్నా.. సమస్యే!

రక్తం.. ఊపిరి ద్వారా ఆక్సిజన్‌ అందాలన్నా.., శరీరానికి శక్తి రావాలన్నా.., అవయవాలను పనిచేయించే హార్మోన్లు వాటిని చేరుకోవాలన్నా.., రోగ నిరోధక శక్తి ఉండాలన్నా.. కావలసిన అత్యంత ముఖ్యమైన కణజాలం. ఈ రక్తాన్ని శరీర భాగాల నుంచి గుండె, ఊపిరితిత్తులకు.., ఊపిరితిత్తుల నుంచి గుండె, ఇతర శరీర అవయవాలకు నిరంతరం ప్రసరింపచేసేవి రక్తనాళాలు. ఒక్కమాటలో చెప్పాలంటే శరీరంలోని అవయవాలన్నింటికీ రక్తాన్ని చేరవేసే అనుసంధానకర్తలు రక్తనాళాలు. కాని మన అలవాట్ల వల్ల ఇవి దెబ్బతింటున్నాయి. శోషరస వ్యవస్థలోని నాళాలు, గ్రంథులు కూడా సమస్యలకు లోనవ్వొచ్చు. 

గంటలు గంటలు కూర్చుని పనిచేస్తున్నారా..? 

లేక రోజంతా నిల్చునే ఉంటున్నారా..? 

ఏ పనైనా అతిగా చేస్తే ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. ఎక్కువ సేపు కూర్చుంటే కొవ్వు పేరుకుపోయి స్థూలకాయం, డయాబెటిస్‌ లాంటి సమస్యలే కాదు.. రక్తనాళ సమస్యలు కూడా వస్తాయి. ఎక్కువ సేపు నిల్చున్నా ఇలాంటి సమస్యలు తప్పవంటున్నారు వైద్య 

నిపుణులు. ఉదయం స్కూల్‌ మొదలైనప్పటి నుంచి చివరి పీరియడ్‌ అయిపోయేవరకు దాదాపుగా నిల్చునే ఉంటారు టీచర్లు.. ట్రాఫిక్‌ని నియంత్రించే క్రమంలో అసలు 

కూర్చునే అవకాశమే ఉండదు ట్రాఫిక్‌ పోలీసులకి... మరోవైపు అసలు నిల్చోవడానికీ, 

నడవడానికీ అవకాశమే లేకుండా రోజంతా కూర్చునే పనిచేస్తుంటారు సాఫ్ట్‌వేర్‌ 

ఉద్యోగులు. వీళ్లు చేసే పనులు వేరైనా వాళ్లకు వచ్చే జబ్బులు మాత్రం ఒకటే. 

అవే.. రక్తనాళ సమస్యలు!


ప్రమాదంలో గాయపడితే.. 

రోడ్డు ప్రమాదాల్లో గాయపడినప్పుడు మోకాలిలో ఫ్రాక్చర్లు అయ్యే అవకాశం ఉంటుంది. రక్తనాళాలకు గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రాణాపాయం ఉంటుంది. పేషెంటును కాపాడడానికి వాస్కులర్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తారు. అంటే గాయపడిన రక్తనాళాన్ని తీసేసి, దాని స్థానంలో మరో రక్తనాళాన్ని అమరుస్తారు. ఈ కొత్త రక్తనాళాన్ని చర్మం కింద ఉపరితల భాగాల్లో ఉండే సిరల నుంచి తీసుకుంటారు. ఈ సిరను తీసుకెళ్లి ధమని స్థానంలో అమరుస్తారన్నమాట. ఈ చికిత్స వల్ల కాలు, చేయి తొలగించాల్సిన పరిస్థితిని నివారించవచ్చు. ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్‌ పేషెంట్లలో రెగ్యులర్‌గా డయాలసిస్‌ చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు అవసరమయ్యే ఎవి ఫిస్టులాలు, పర్మనెంట్‌ కెథటర్లను అమర్చడంలో కూడా వాస్కులర్‌ సర్జన్లు కీలక పాత్ర పోషిస్తారు. 


క్యాన్సర్‌ పేషెంట్లలో...

శరీరంలోని శోషరస వ్యవస్థలో సమస్యలనే లింఫాటిక్‌ సమస్యలంటారు. సాధారణంగా లింఫ్‌ ఎడిమా సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ప్రైమరీ లింఫ్‌ ఎడిమా, సెకండరీ లింఫ్‌ ఎడిమా అని రెండు రకాలుగా ఉంటుంది. పుట్టుకతోనే జన్యుపరమైన కారణాల వల్ల వచ్చేది ప్రైమరీ లింఫ్‌ ఎడిమా. వీళ్లకు పుట్టుకతో శోషరస నాళం అభివృద్ధి చెందకపోవడమో (అప్లేషియా), లేక చిన్నగా ఉండడమో (హైపోప్లేషియా) జరుగుతుంది. దీనివల్ల లింఫాటిక్‌ ఎడిమా కనిపిస్తుంది. సెకండరీ లింఫ్‌ ఎడిమాకు మరేదైనా సమస్య కారణమవుతుంది. అంటే ఫైలేరియా ఇన్‌ఫెక్షన్‌, క్యాన్సర్‌ పేషెంట్లకు ఇచ్చే చికిత్స, సర్జరీ తరువాత ఈ సమస్య కనిపించవచ్చు. ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్‌ ఉన్నవాళ్లకు సర్జరీ తరువాత, రేడియోథెరపీ అయినాక చేతిలో లింఫ్‌ ఎడిమా కనిపించొచ్చు. లింఫ్‌ గ్రంథులు వాచిపోవడం వల్ల చేయంతా వాపు కనిపిస్తుంది. సర్వికల్‌ క్యాన్సర్‌, గర్భసంచి క్యాన్సర్‌ లాంటి పెల్విక్‌ క్యాన్సర్ల చికిత్స తరువాత కాలిలో లింఫ్‌ ఎడిమా కనిపిస్తుంది. వీళ్లలో కాలు వాపు ఉంటుంది.  లింఫ్‌ ఎడిమా సమస్య ఉన్నప్పుడు ముందుగా మందులు ఇస్తారు. మందులే కాకుండా కంప్రెషన్‌ బ్యాండేజ్‌ థెరపీ ద్వారా కూడా చికిత్స చేస్తారు. లింఫ్‌ ఎడిమా పంపు కూడా ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తున్నది. 


logo