బుధవారం 01 ఏప్రిల్ 2020
Health - Mar 16, 2020 , 18:47:01

సుఖ నిద్రకోసం వరిపొట్టు మెత్తలు

సుఖ నిద్రకోసం వరిపొట్టు మెత్తలు

 మార్కెట్‌లో అందుబాటులో ఉండే సింథటిక్‌, రబ్బరు, స్పాంజ్‌లతో తయారైన దిండ్లు ఆరోగ్యకరమైనవి కావు. ఇప్పుడు కొత్తగా విపణిలోకి వరిఊకతో రూపొందించిన తలగడలు వచ్చాయి. ఇవి ఇంతకు ముందున్న వాటితో పోలిస్తే ఎంతో మేలు చేయడమేకాకుండా, హాయిగా నిద్ర పట్టేలా చేస్తాయట. ఇదే విషయాన్ని వైద్యనిపుణులు దృవీకరిస్తున్నారు. 100శాతం ఇవి పర్యావరణ హితమైనవిగా చెబుతున్నారు. మెడ, భుజం నొప్పుల బారిన పడకుండా ఉండేందుకు ఎక్కువమంది మెత్తలు వాడుతుంటారు. దూది, కొబ్బరి పీచు, స్పాంజ్‌ వంటి పదార్థాలతో తయారైన దిండ్లు ఆరోగ్యకరమైన నిద్రకు సరైనవి కావని పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. వరిఊకతో రూపొందించిన దిండ్లు ప్రకృతికి దగ్గరగా ఉంటాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. నిద్రించేటప్పుడు భంగిమ ఎలా ఉన్నా అందుకు తగ్గట్టుగా మారుతూ తల, మెడకు అనుకూలంగా వరిపొట్టుతో తయారైన తలగడ ఉంటుందట. దీని ద్వారా సుఖవంతమైన నిద్రనుపొందవచ్చని పలు అధ్యయన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 


logo
>>>>>>