బుధవారం 01 ఏప్రిల్ 2020
Health - Feb 27, 2020 , 22:13:37

ఆవిరి పట్టు.. జలుబు పోయేట్టు!

ఆవిరి పట్టు.. జలుబు పోయేట్టు!

  • నీటిని బాగా మరిగించి అందులో కాస్త కర్పూరం, పసుపు వేసి ఆవిరి పట్టాలి. శ్వాస బాగా ఆడుతుంది. విక్స్‌, ఝండూబామ్‌ కూడా వేసుకొని ఆవిరి పట్టొచ్చు. ఇవేమీ అందుబాటులో లేనప్పుడు బాగా మరిగించిన నీటిలో పసుపు వేసి ఇంకాస్త మరిగించి ఆవిరి పట్టుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు జలుబు తగ్గేవరకు ఆవిరి పట్టుకోవచ్చు.
  • జలుబు చేసినప్పుడు చికాకు కలుగుతుంది. త్వరగా అలిసిపోయినట్లుగా అనిపిస్తుంటుంది. అందుకే ఈ సమయంలో ఎక్కువ విశ్రాంతి తీసుకుంటే మంచిది. వేడిపాలల్లో చిటికెడు పసుపు వేసి పిల్లలకు తాగిస్తే జలుబు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
  • అల్లం, మిరియాల చాయి తాగినా లేదా వేడి ద్రవపదార్థాలను తీసుకున్నా జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జలుబు నుంచి ఉపశమనం పొందొచ్చు.
  • జలుబు చేసినప్పుడు శుభ్రత ముఖ్యం. తుమ్మినా, దగ్గినా చేతిరుమాలును వాడాలి. చేతిరుమాలును ఎప్పటికప్పుడు ఉతకాలి. 


logo
>>>>>>