సోమవారం 30 మార్చి 2020
Health - Feb 26, 2020 , 23:04:02

పోషకాల బీర.. ఆరోగ్య ధార

పోషకాల బీర.. ఆరోగ్య ధార

బీరకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వారంలో కనీసం ఒక్కసారైనా బీరకాయలు ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు న్యూట్రిషియన్లు. బీరకాయను ఆహారంలో తీసుకుంటే కలిగే లాభాలేంటంటే..

బీరకాయలోని సి విటమిన్‌, ఐరన్‌, రిబోఫ్లోవిన్‌, మెగ్నీషియం, థయామిన్‌తో పాటు అనేక రకాల ఖనిజ లవణాలుంటాయి. బీరకాయలో కొవ్వు, కొలెస్ట్రాల్‌, కేలరీలు తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారం.


సెల్యులోజ్‌, నీటిశాతం ఎక్కువ కాబట్టి మలబద్ధకం, ఫైల్స్‌ సమస్యతో బాధపడేవారికి బీరకాయ తినడం చక్కటి పరిష్కారం. రక్తంలో, మూత్రంలోనూ చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తీసుకుంటే మంచిది.


బీరకాయల్లో బీటా కెరోటిన్‌ సమృద్ధిగా ఉంటుంది.  ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. బీరకాయ రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ సహాయపడుతుంది. దీనివల్ల మొటిమలు తొలిగిపోతాయి. దేహం నుంచి ఆల్కహాల్‌ కారక వ్యర్థాలను తొలగించి కాలేయం, గుండె ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది.


కామెర్ల వ్యాధి సహజంగా తగ్గాలంటే రోజూ ఒక గ్లాస్‌ బీరకాయ రసం తాగితే చాలు. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. బీరకాయలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తరచూ తీసుకుంటుంటే మలబద్దక సమస్య దూరమవుతుంది.


logo