శనివారం 04 ఏప్రిల్ 2020
Health - Feb 24, 2020 , 22:25:49

పెళ్లితో గుండె పదిలం

పెళ్లితో గుండె పదిలం

కెరీర్‌లనీ.., టార్గెట్‌లనీ వివాహాన్ని వాయిదా వేసుకుంటూ పోతే మీ గుండె కష్టంలో పడుతుందంటున్నారు పరిశోధకులు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉందామనుకుంటే గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఇటీవల బ్రిటన్‌లో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఒంటరిగా ఉంటున్నవాళ్లతో పోలిస్తే పెళ్లయినవాళ్లు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందంటున్నారు ఈ అధ్యయనకారులు. ఈ అధ్యయనంలో భాగంగా 10 లక్షల మంది పెళ్లి కానివాళ్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. వీళ్లంతా బీపీ, డయాబెటిస్‌, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్టు గుర్తించారు. 50 నుంచి 70 ఏళ్ల వయసున్నవాళ్లలో అవివాహితుల కంటే పెళ్లయినవాళ్లలో 16 శాతం మంది ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారని తేలింది. అందుకే ఏ వయసుకా ముచ్చట ఉండాలి మరి. 


logo