శనివారం 28 మార్చి 2020
Health - Feb 21, 2020 , 22:54:12

కాజు తినండి రోజూ..

కాజు తినండి రోజూ..

జీడిపప్పును సాధారణంగా ఉప్మాలో, పాయసంలో వాడుతుంటారు. కానీ వీటిని రోజూ తినొచ్చు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీడిపప్పును రోజూ తినడం వల్ల కలిగే లాభాలు.

  • జీడిపప్పు మెటబాలిజాన్ని సక్రమపరిచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇందులో పీచు పదార్థాలు ఆకలి వేసేలా చేయవు. అందుకే రోజు మొత్తం జీడిపప్పును స్నాక్స్‌గా తీసుకున్నా ఆకలివేసినట్లు అనిపించదు. 
  • జీడిపప్పులోని కాపర్‌, ఐరన్‌ రక్తకణాల సంఖ్యను పెంచుతుంది. వ్యాధినిరోధకత పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఎముకలకు జీడిపప్పులు బలాన్నిస్తాయి. ఇందులోని లుటిన్‌ అనే పదార్థం కంటికి మేలు చేస్తుంది. కంటి పొరను కాపాడుతుంది.
  • రోజుకు గుప్పెడు జీడిపప్పులు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. జీడిపప్పుతో పాటు వాల్‌నట్స్‌, బాదాం, ఎండు ద్రాక్షలు, పండ్లు తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
  • రోజూ నాలుగు గ్రాముల జీడిపప్పుని తీసుకుంటే ఆకలి ఎక్కువగా వేయదు. దీని ద్వారా బరువును నియంత్రించుకోగలుగుతారు. ఒబెసిటీ తగ్గుతుంది. ఉప్పులో వేయించిన జీడిపప్పును తీసుకోకపోవడం మంచిది. దీనికి బదులు వట్టి జీడిపప్పును దోరగా వేయించి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
  • స్నాక్స్‌గా జీడిపప్పును తీసుకుంటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు సులభంగా అందుతాయని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. బరువు తగ్గుతారని చెప్పి అధిక మోతాదులో కూడా జీడిపప్పును తీసుకోవద్దని వారు చెబుతున్నారు.


logo