ఆదివారం 23 ఫిబ్రవరి 2020
ద్రవరూప ఆహారం

ద్రవరూప ఆహారం

Feb 14, 2020 , 22:50:50
PRINT
ద్రవరూప ఆహారం

  • క్యారెట్‌ రసంలో ఉండే కెరోటిన్‌ కాలేయానికి మేలు చేస్తుంది. బరువు తగ్గేందుకు కంటిచూపును మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. ఉదర సంబంధ వ్యాధులతోపాటు క్యాన్సర్లను నిరోధించే శక్తి ఉంది.
  • ప్రతిరోజూ భోజనం చేసే గంట ముందు రోజుకు రెండుసార్లు చొప్పున తోటకూర రసం తీసుకుంటే రక్తంలోని షుగర్‌ స్థాయిలు తగ్గుతాయి. 
  • వారానికోసారి టమాటా రసం తీసుకుంటే గుండె సంబంధ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
  • కీరారసం కీళ్ల రుగ్మతలను పోగొడుతుంది. దీనిలో ఉండే అత్యున్నత స్థాయి పొటాషియం కిడ్నీలను శుభ్రపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. చర్మ సమస్యలను నివారించే మంచి ఔషధంలానూ పనిచేస్తుంది.
  • కొత్తిమీరలో కాల్షియం కంటెంట్‌ ఎక్కువ. ఇది ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. నెలసరి సమయంలో వేధించే నొప్పులు, ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు.
  • బీట్‌రూట్‌ రసం తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.  పెదాలు పొడిబారకుండా ఉంటాయి.


logo