శనివారం 29 ఫిబ్రవరి 2020
కొత్త ఎర్రరక్త కణాలు

కొత్త ఎర్రరక్త కణాలు

Feb 13, 2020 , 22:50:45
PRINT
కొత్త ఎర్రరక్త కణాలు

మానవ శరీరంలోకి ఔషధాలను చేరవేయగల అసాధారణ ఎర్రరక్త కణాలకు శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. ప్రస్తుత ‘కృత్రిమ అణువుల పనితనాన్ని’ మించిన సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉండడం విశేషం.

మన దేహం పొడుగునా ఔషధాన్ని చేరవేయగల అద్భుత ఎర్రరక్త కణాల (Super-human red blood cells) ఆధునీకృత విధానాన్ని కెనడాలోని మాక్‌మాస్టర్‌ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి పరిచారు. క్యాన్సర్‌, అల్జీమర్స్‌వంటి వినాశనకర, సంక్రమణ వ్యాధుల కణితిలు (tumours), బ్యాక్టీరియా (సూక్ష్మజీవులు)కు చికిత్సకోసం పనిచేసేలా వీటిని రూపొందించారు. ఒకేసారి కొన్ని వారాలపాటు శరీరంలో వీటిని ప్రవహింపజేయవచ్చుననీ వారన్నారు. ‘అడ్వాన్స్‌డ్‌ బయోసిస్టమ్స్‌' పత్రికలో ఇటీవల ప్రచురితమైన ఈ కొత్త సాంకేతికత ‘ప్రస్తుత కృత్రిమ అణువులతో చేసే ఔషధ బట్వాడా విధానాలవల్ల ఎదురవుతున్న ముఖ్యసమస్యను పరిష్కరించిందని కూడా వారు తెలిపారు. ఎర్రరక్త కణాన్ని తెరిచి, బాహ్య కుడ్యాన్ని ఆధునీకరించి, ఔషధ పరమాణువును చేర్చి, తిరిగి శరీరంలోకి ఇంజెక్ట్‌ చేయగల రీతిలో దీని విధానాన్ని తయారు చేశారు. కృత్రిమ, జీవసంబంధ పదార్థంతో రూపొందిన ఈ ఎర్రరక్త కణం పనితనం మామూలు ఎర్రరక్త కణం వలెనే ఉండటమేకాక ఉపరితలం సంబంధిత బ్యాక్టీరియాకు అంటుకోగలదిగానూ ఉంది. వీటిద్వారా పేషెంటుకు ఇచ్చే డోసేజ్‌ను అవసరానుకూలంగా తగ్గించుకోవచ్చునని కూడా వారంటున్నారు.


logo