శనివారం 29 ఫిబ్రవరి 2020
తమలపాకుతో చాలా లాభాలు

తమలపాకుతో చాలా లాభాలు

Feb 12, 2020 , 23:19:37
PRINT
తమలపాకుతో చాలా లాభాలు

తమలపాకు ఆరోగ్యానికి మంచిది. ఇందులో కాల్షియం, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సాయపడుతుంది. తమలపాకు తింటే మరెన్నో ఉపయోగాలు..

  • ప్రతి రోజు 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడినీళ్లతో తీసుకుంటే బోద వ్యాధితో బాధపడుతున్న వారికి చక్కని ఫలితం కనిపిస్తుంది. తమలపాకు రసాన్ని రెండు కళ్లలోనూ చుక్కలుగా వేస్తే రేచీకటి సమస్య క్రమంగా తగ్గుతుంది. తమలపాకు రసాన్ని టీ స్పూన్‌ మోతాదులో తీసుకుంటే గుండె పనితీరు మెరుగుపడుతుంది. 
  • ఎక్కువగా కూర్చొని పనిచేసేవారికి సాధారణంగా ఎదురయ్యే సమస్య వెన్నునొప్పి. వేడిగా ఉండే తమలపాకు రసాన్ని కొబ్బరినూనెతో కలిపి బాగా మిక్స్‌ చేసి, వెన్నుకు మర్దన చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడేవారు ఆవనూనెను గోరువెచ్చగా చేయాలి. దీనిలో తమలపాకును నానబెట్టి ఈ మిశ్రమాన్ని ఛాతి మీద రాస్తే ఉపశమనం దొరుకుతుంది.
  • రోజూ ఒక తమలపాకును తింటే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. దెబ్బలు తగిలినప్పుడు వాపు, రక్తం గడ్డ కట్టడం లాంటివి జరిగినప్పుడు తమలపాకును వేడి చేసి వాపు లేదా రక్తం గడ్డ కట్టిన ప్రాంతంలో కట్టులాగా కడితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
  • భోజనం తర్వాత తమలపాకు తింటే నోరు శుభ్రమవుతుంది. ఇది జీర్ణక్రియకు బాగా తోడ్పడుతుంది. కానీ ఈ ఆకును అధికంగా తీసుకుంటే అనర్థాలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాన్‌, ఇతర ఏ రూపంలో అయినా రోజుకు ఒక ఆకును మించి తీసుకోవద్దని చెబుతున్నారు.
  • చుండ్రు సమస్యతో బాధపడుతున్నవారు తమలపాకులను ముద్దగా చేసి తలకు పట్టించాలి. గంటసేపు ఆగి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. ఇలా చుండ్రు సమస్య తగ్గేవరకు వారానికి రెండుసార్లు చొప్పున చేయవచ్చు.


logo