శనివారం 29 ఫిబ్రవరి 2020
నిద్ర పట్టడం లేదా? అరటి తాగండి!

నిద్ర పట్టడం లేదా? అరటి తాగండి!

Feb 11, 2020 , 23:12:00
PRINT
నిద్ర పట్టడం లేదా? అరటి తాగండి!

  • ఒక అరటిపండు తీసుకొని దానిని ముందుగా శుభ్రపరుచుకోవాలి. దాని కొనలను ఇరువైపులా అంటే పైన కోన, కింద కొన కత్తిరించాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని దానిలో ఒక గ్లాస్‌ నీళ్లు పోసి ముందుగా కత్తిరించి పెట్టుకున్న అరటిపండును అందులో వేసి ఒక పదినిమిషాల పాటు బాగా మరగపెట్టాలి.
  • బాగా మరిగించిన తర్వాత ఆ పాత్రను తీసుకొని దానిని వడకట్టి ఆ నీరును వేరు చేయాలి. అరటిపండు మామూలుగానే తీయగా ఉంటుంది. కనుక మనం ప్రత్యేకంగా చక్కెర, బెల్లంలాంటి వాటిని కలుపుకోవాల్సిన అవసరం లేదు.
  • ఈ మిశ్రమం ఉడికేటప్పుడు దాల్చిన చెక్క కూడా కావాలంటే వేసుకోవచ్చు. లేకున్నా దాని పొడి అయినా మరిగించిన నీటిలో కలుపుకోవచ్చు. అరటిపండులో సహజంగానే మూలకాలు ఉండడం వల్ల అవి మీకు శక్తితోపాటు అందులో అమైనో ఆమ్లాల వల్ల చక్కటినిద్ర కూడా పడుతుంది.
  • ఈ చిన్న చిట్కా వాడడం వల్ల మీరు నిద్రలేమి సమస్య నుంచి దూరం కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. హాయిగా నిద్రపోండి.


logo