మంగళవారం 31 మార్చి 2020
Health - Feb 08, 2020 , 22:31:51

అందరి ఆరోగ్యం కోసం

అందరి ఆరోగ్యం కోసం

జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా మహిళలు పలు రుగ్మతలకు గురవుతున్నారు. సరిగ్గా ఇదే సమస్యను ఎదుర్కొన్న ఓ మహిళ అటువంటివాటిని పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది. తనలా మరెవరూ బాధపడకూడదని అందరికీ ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించేందుకు సిద్ధమైంది.

బెంగళూరుకు చెందిన విభహరిష్‌ అనే మహిళ అంతరిక్షయాన రంగంలో ఉద్యోగినిగా పని చేస్తున్నది. అక్కడ కొన్నాళ్లపాటు ఉద్యోగం చేసిన తర్వాత ఆమెకు పాలిస్టిక్‌ ఓవరియన్‌ డిసీజ్‌ (పీసీఓడీ) ఉన్నదని తేలింది. విభ తల్లి హోమియోపతి వైద్యురాలు. ఆమె విభ ఆరోగ్యం గురించి  ఎన్నోసార్లు హెచ్చరించింది. అయినా సరే విభ తన ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ధ చూపేది కాదు. దీంతో  కొన్నాళ్లకు విభకు అండాశయ సంబంధిత వ్యాధి ఉన్నట్లు  వైద్యులు గుర్తించారు. అందుకు శస్త్ర చికిత్స అవసరమని తేల్చారు.  ఆపరేషన్‌ లేకుండా ఈ సమస్యకు పరిష్కార మార్గాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు అన్వేషణ మొదలు పెట్టింది విభ. సరైన పౌష్ఠికాహారంతోపాటు జీవనశైలిలో వచ్చిన మార్పులే ఈ అండాశయ వ్యాధులకు కారణమని తెలుసుకొన్నది. తనలా ఎంతోమంది మహిళలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని గ్రహించింది. 


అటువంటి వారికి సరైన పరిష్కారాన్ని అందించాలనుకున్నది. అందుకోసం అంతరిక్షయానంలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసింది. పలు కంపెనీలు జనాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాసిరకం మూలికల పొడులు అమ్ముతున్నాయి. ఇదే విషయాన్ని విభ గుర్తించింది. 100 శాతం ఆయుర్వేద మూలికలను అందించడానికి సిద్ధమైంది. అందుకు అవసరమైన అధ్యయనాన్ని చేపట్టింది. మొక్కలు, వాటికి ఉన్న శక్తులను గురించి తెలుసుకున్నది. మూలికలతో కొన్ని ఉత్పత్తులు రూపొందించింది. వీటిని మొదట 60 మందిపై ప్రయోగించింది. వారిలో నెమ్మదిగా మార్పులు రావడం గమనించింది. ఆమె చేసిన పరిశోధనలు ఫలించాయి. దీంతో విభ హరిష్‌  తను సొంతగా తయారు చేసిన ఉత్పత్తులను‘ కాస్‌మిక్స్‌' పేరుతో అమ్మడం ప్రారంభించింది.  


logo
>>>>>>