శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Health - Feb 03, 2020 , 22:46:47

నమిలి తింటేనే మేలు

నమిలి తింటేనే మేలు

ఉరుకులు, పరుగులు ఎక్కువైపోయాయి.. తినడానికి కూడా టైం ఉండడం లేదు. అందుకే చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్‌ చేస్తుంటారు. తప్పనిసరిగా తినాల్సి వస్తే హడావుడిగా నోట్లో ముద్దలు నమలకుండా మింగేస్తుంటారు. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. పోషకాలు కూడా సరిగ్గా అందవంటున్నారు నిపుణులు. ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమిలి తినాలని మన పెద్దవాళ్లు చెబుతుంటారు. ఇది మంచి ఫలితం ఇస్తున్నట్టు శాస్త్రీయంగానూ రుజువైంది. బాగా నమిలి తినడం వల్ల ఆహారంలోని పోషకాలను శరీరం మరింత సమర్థవంతంగా గ్రహిస్తుందని ఇటీవలి అధ్యయనాల్లో వెల్లడైంది. తినేటప్పుడు ఆదరాబాదరాగా గబగబా నోట్లో కుక్కేసుకోకుండా కాస్త నిదానంగా నమిలి తినాలి. చిన్నారులు, వృద్ధులకు ఇచ్చే ఆహారం కాస్త మెత్తగా ఉంటే మంచిది. మెత్తగా ఉంటే ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దాంతో అసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలు కూడా రావు.


logo