మంగళవారం 31 మార్చి 2020
Health - Feb 03, 2020 , 22:42:34

కోడిగుడ్డు మంచిదా.. కాదా?

కోడిగుడ్డు మంచిదా.. కాదా?

పిల్లలకు ప్రతిరోజూ గ్లాసుడు పాలూ, ఒక కోడిగుడ్డూ తప్పనిసరిగా పెడితే తగినంత ప్రొటీన్‌ అంది, పెరుగుదల బాగుంటుందన్నది పెద్దల మాట. కానీ ఆ తరువాత కోడిగుడ్డా.. అమ్మో.. తింటే గుండెపోటు రావొచ్చు.. అన్న భయం ఉండేది మొన్నటివరకు. కోడిగుడ్లలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుండెకు మంచిది కాదని చెప్పేవాళ్లు. కాని ఇప్పుడు చెప్తున్న కొత్త అధ్యయనం పాత నమ్మకమే కరెక్ట్‌ అంటోంది. కోడిగుడ్డు వల్ల గుండెకు హాని చేసే కొలెస్ట్రాల్‌ పెరగడానికీ, కోడిగుడ్డు తినడానికీ సంబంధం లేదని తేల్చారు కెనడాకు చెందిన మెక్‌ మాస్టర్‌ యూనివర్సిటీ, హామిల్టన్‌ హెల్త్‌ సైన్సెస్‌కి చెందిన పరిశోధకులు. 177 వేల మందిపై అధ్యయనం చేసిన అనంతరం వాళ్లు ఈ విషయం చెప్తున్నారు. 12,701 గుండెపోటు మరణాలు, 13,658 గుండెపోటు బాధితులను ఈ సందర్భంగా అధ్యయనం చేశారు. వాళ్ల గుండెజబ్బుకీ, కోడిగుడ్డుకీ సంబంధం లేదని దీనిలో వెల్లడైంది. అందుకే ప్రొటీన్లు, పోషకాల కోసం ప్రతిరోజూ ఒక కోడిగుడ్డు తినడం మంచిదని సూచిస్తున్నారు. 


logo
>>>>>>