బుధవారం 01 ఏప్రిల్ 2020
Health - Jan 27, 2020 , 23:21:08

కూర్చుని చేసే ఉద్యోగాలు తగ్గుతున్న జ్ఞాపకశక్తి

కూర్చుని చేసే ఉద్యోగాలు తగ్గుతున్న జ్ఞాపకశక్తి

సాఫ్ట్‌వేర్‌ రంగం అభివృద్ధి చెందినప్పటి నుంచి కూర్చుని చేసే ఉద్యోగాలు పెరిగిపోయాయి. ఎటూ నడవకుండా గంటల గంటలు కుర్చీలకు అతుక్కుపోవడం వల్ల అనేక అనర్థాలు కలుగుతాయని వైద్యనిపుణులు చెప్తూనే ఉన్నారు. ఇటీవలి పరిశోధన మరో కొత్త విషయాన్ని బయటపెట్టింది.

ఎక్కువ సేపు కుర్చీలో కూర్చునేవాళ్లలో జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోతుందని అమెరికాలో జరిగిన ఇటీవలి పరిశోధనలు చెప్తున్నాయి. ఎక్కువ సమయం కూర్చుని ఉండేవాళ్లు మధుమేహం, గుండెజబ్బుల బారిన పడే అవకాశం, తద్వారా అకాల మరణాలకు గురయ్యేందుకు ఆస్కారం ఎక్కువని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఇలా గంటల కొద్దీ కూర్చుని ఉండడం వల్ల మెదడులోని జ్ఞాపకశక్తికి సంబంధించిన మీడియల్‌ టెంపోరల్‌ లోబ్‌ (ఎం.టి.ఎల్‌.) పొర పలుచబడుతోందని ఈ పరిశోధనలో నిర్ధారణ అయింది. మధ్య వయసు వాళ్లు, వృద్ధుల్లో ఈ పొర దెబ్బతినడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోయి, డిమెన్షియా సమస్యకు దారితీస్తోంది. ఒకసారి పొర దెబ్బతిన్న తరువాత ఎంత వ్యాయామం చేసినా ఫలితం లేదు. తిరిగి ఎంటిఎల్‌ పొర బాగుపడలేదు. కూర్చుని ఉండడాన్ని తగ్గించడమే దీనికి పరిష్కారం అంటున్నారు పరిశోధకులు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే క్రమంగా అల్జీమర్స్‌ వ్యాధి వచ్చే అవకాశాలుంటాయని చెప్తున్నారు. అందుకే ఎక్కువసేపు కూర్చోకుండా కనీసం గంటకు ఒకసారైనా లేచి అటూ ఇటూ తిరగడం వల్ల కొంతవరకు ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. 


logo
>>>>>>