గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Jan 18, 2020 , 00:28:49

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ తప్పదా?

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ తప్పదా?

నా వయస్సు 26 సంవత్సరాలు. ఈమధ్య ఆకలి లేకపోవడం, నీరసంగా ఉంటే పరీక్షలు చేయించుకున్నాను. క్రియాటినిన్‌14 మి.గ్రా., యూరియా 320 నానోగ్రామ్‌ ఉంది. స్కానింగ్‌లో కిడ్నీ సైజు తగ్గింది. సికెడి 5ఒ స్టేజి అని చెప్పారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకోవాలన్నారు. ట్రాన్స్‌ప్లాంట్‌ కాకుండా ఏమైనా ఆప్షన్స్‌ ఉన్నాయా? ట్రాన్స్‌ప్లాంట్‌కు డోనర్‌గా ఎవరు ఇవ్వొచ్చు?
- కవిత, మహబూబ్‌నగర్‌

మీకు కిడ్నీ మార్పిడి చేయించుకోవడమే ఉత్తమ మార్గం. డోనర్‌గా అన్నదమ్ములుగానీ, అక్కాచెల్లెళ్లుగాని ఇవ్వొచ్చు. లేదా తల్లిదండ్రుల నుంచి ఒక కిడ్నీ తీసుకోవాల్సి ఉంటుంది. డోనర్స్‌కి అన్ని టెస్ట్‌లు చేయించి, ఒక కిడ్నీ దానం చేయడం వల్ల ఏ సమస్య రాదని నిర్ధారణ అయిన తర్వాతే డోనర్‌గా యాక్సెప్ట్‌ చేస్తారు. తరువాత డోనర్‌కు ఎలాంటి సమస్య ఉండదు. డోనర్‌ దగ్గరి రిలేటివ్‌ అయితే కిడ్నీ ఎక్కువ రోజులు పనిచేసే అవకాశం ఉంటుంది. రిజెక్ట్‌ చేసేందుకు ఆస్కారం తక్కువ. ట్రాన్స్‌ప్లాంట్‌ అయిన తర్వాత కూడా రెగ్యులర్‌గా మందులు వాడాల్సి ఉంటుంది. డోనర్‌ లేకపోతే రెగ్యులర్‌గా డయాలసిస్‌ చేయించుకోవాలి. ఇది ఇంట్లో చేసుకోవచ్చు. లేదా హాస్పిటల్‌కి వచ్చి చేయించుకోవచ్చు. చనిపోయిన వ్యక్తి నుంచి (కెడావర్‌) ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కోసం రిజిస్టర్‌ చేయించుకోవాలి.


- డాక్టర్‌ విక్రాంత్‌ రెడ్డి
-సీనియర్‌ ,కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌
-కేర్‌ హాస్పిటల్స్‌,హైదరాబాద్‌




logo
>>>>>>