గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Jan 12, 2020 , 23:29:08

ఈ జబ్బుకు పరిష్కారం ఏమిటి?

ఈ జబ్బుకు పరిష్కారం ఏమిటి?

నా వయసు 60 సంవత్సరాలు. నేను ఒక సంవత్సరం క్రితం ఆరోగ్యంగా ఉండేదాన్ని. బీపీ, షుగర్‌ లాంటి వ్యాధులు ఏమీ లేవు. ఏడాది నుంచి బాగా నెమ్మదిస్తున్నాను. ఏ పని చేయాలన్నా చాలా సమయం తీసుకుంటున్నాను. త్వరగా నడవలేకపోతున్నాను. ఒకట్రెండుసార్లు కింద కూడా పడిపోయాను. కుడి చెయ్యి వణుకుతూ ఉంటుంది. సంవత్సరం నుండి న్యూరోజైన్‌ మాత్రలు వేసుకుంటున్నా ఫలితం లేదు. దయచేసి పరిష్కారం చెప్పగలరు. - సుజాత, వరంగల్‌


మీరు పార్కిన్‌సన్స్‌ జబ్బుతో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ జబ్బు 60 సంవత్సరాలు నిండినవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కూర్చుని ఉన్నప్పుడు, చెయ్యి వణకడం, తొందరగా నడవలేకపోవడం, కూర్చునేటప్పుడు గబుక్కున ఒక దిమ్మ మాదిరిగా కూర్చోవడం, ఎవరన్నా వెనుక నుంచి పిలిచినప్పుడు వెంటనే తిరగలేకపోవడం, ముఖంలో కదలికలు లేకపోవడం, నోటి నుంచి ఉమ్మి కారిపోవడం వంటివి ఈ జబ్బు లక్షణాలు. మెదడులో డొపమైన్‌ అనే కెమికల్‌ తగ్గిపోవడం వల్ల మనిషి లోని కదలికలు తగ్గిపోతాయి. దీన్ని టాబ్లెట్‌ రూపంలో ఇవ్వడం ద్వారా మనిషిని నడిచేటట్లు చేయవచ్చు. సిండోసా, రోపాల్క్‌, పాసిటోన్‌ వంటి మందులతో ఈ జబ్బుకి వైద్యం చేయవచ్చు. ఈ మందులు వాడుకుంటూ 10-15 ఏండ్ల వరకు వాళ్ల పనిని వాళ్లు చేసుకునే అవకాశం ఉంటుంది. ఐదు నుంచి ఏడు సంవత్సరాలు గడిచాక, మెడిసిన్స్‌ సరిగా పనిచేయనప్పుడు డిబిఎస్‌ అనే సర్జరీ ద్వారా రోగిని నడిపించవచ్చు. మీరు ఒక సంవత్సరం నుంచే బాధపడుతున్నారు. కాబట్టి సరైన మందులతో మీ రోగాన్ని నయం చేయవచ్చు. 


-డాక్టర్‌ మురళీధర్‌ రెడ్డి

-కన్సల్టెంట్‌ న్యూరాలజిస్ట్‌, కేర్‌ హాస్పిటల్స్‌,హైదరాబాద్‌


logo