సోమవారం 30 మార్చి 2020
Health - Jan 08, 2020 , 15:30:53

వేడినీటి స్నానం మంచిదేనా?

వేడినీటి స్నానం మంచిదేనా?

చలికాలం. వెచ్చవెచ్చగా వేడినీటి స్నానం చేద్దామని కోరుకోని వారుండరు. చాలామంది మరిగే నీళ్లను ఒంటిమీద పోసుకొని హ్యాపీగా ఫీలవుతుంటారు. కానీ ఇది ఎంతవరకు మంచిదని ఏ ఒక్కరూ ఆలోచించరు.

-వేడి నీటికంటే చల్లటి నీటితోనే స్నానం చేయడం మంచిదంటున్నారు నిపుణులు. వేడి నీటితో స్నానం చేస్తే బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంటుంది. దీనివల్ల నిద్ర వచ్చినట్లు మత్తుగా ఉంటుంది. దీంతో రోజంతా అలసటగా ఉంటుంది.
-చల్లటి నీటితో స్నానం చేస్తే ముఖంపై చిన్న చిన్న రంధ్రాలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు నిపుణులు. ఈ కారణంగా చాలామంది ఉదయాన్నే మాస్క్ వేసుకుంటారు. ఐస్ మాస్క్ అంటే ఓ బౌల్‌లో చల్లని నీటిని తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసి ముఖం కాసేపు ఆ బౌల్‌లో ఉంచడం. దీనివల్ల ముఖంపై రంధ్రాలు తగ్గడమే కాకుండా ముఖం తాజాగా మారుతుంది. అందంగా కనిపిస్తారు.
-స్నానానికి వేడి నీటిని ఉపయోగించడం సాయంత్రం వేళ మంచిది. దీని వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. హాయిగా నిద్రపడుతుంది. అలసిన కండరాలు కూడా బాగా రిలాక్స్ అవుతాయి. అయితే బాగా మరిగిన నీటితో స్నానం చేయకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.
-మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడే వారు చన్నీటితో స్నానం చేస్తే సమస్య ఇంకా ఎక్కువవుతుంది. తలనొప్పి, తలపట్టేసినట్లు ఉండడం వల్ల ఎక్కువ అవుతాయి. కాబట్టి మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నవారు ఉదయం గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.


logo