సోమవారం 30 మార్చి 2020
Health - Jan 08, 2020 , 15:30:04

జున్నుతో ఎన్నో లాభాలు..

జున్నుతో ఎన్నో లాభాలు..

సాధారణంగా జున్ను అనగానే నోరూరించే పదార్థం. ఇది నోటికి రుచి అందించడమే కాదు. శరీరానికి ఆరోగ్యాన్ని, మొహానికి అందాన్నీ ఇస్తుంది. అటువంటి జున్నులో విటమిన్లు పుష్కలంగా దొరుకుతాయి.

-జున్నులో విటమిన్-డి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో డి-విటమిన్ లోపంతో కలిగే ఆస్టియోపోరోసిస్ లోపాలను అధిగమించడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు పుష్టిగా ఉంటారు.
-విరేచనాలు, మలబద్ధకానికి జున్ను విరుగుడులా పని చేస్తుంది. జున్నుతో శరీరంలో రోగనిరోధక శక్తికూడా పెరుగుతుంది.
-సన్నగా ఉన్న వారు క్రమం తప్పకుండా జున్ను తీసుకుంటే శరీరాకృతిలో మార్పులు గమనించవచ్చు. జున్నులోని ప్రోటీన్లు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. దీంతోపాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
-అందమైన ముఖంకోసం జున్నును ఉపయోగించవచ్చు. ఒక స్పూన్ ఓట్స్‌లో, రెండు స్పూన్ల జున్ను వేసి పేస్ట్ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు మందంగా పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
-వాతావరణ కాలుష్యం వల్ల ముఖం అలసిపోయి, నిర్జీవంగా మారుతుంది. అలాంటపుడు జున్నుతో మర్దన చేయాలి. యాంటీఏంజిల్ గుణాలు కలిగిన జున్ను ఈ సమస్యను పరిష్కరిస్తుంది.


logo