బుధవారం 01 ఏప్రిల్ 2020
Health - Jan 08, 2020 , 15:23:36

‘తులసి’తో ఆరోగ్యం

‘తులసి’తో ఆరోగ్యం

దేవతార్చనలో తులసి మొక్కది ప్రత్యేక స్థానం. తులసితో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. తులసిని ఉపయోగించి ఎలాంటి సమస్యలను నయం చేసుకోవచ్చంటే..


- పలురకాల జ్వరాల్లో ముఖ్యంగా వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసీ ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించితాగితే వాటి జ్వరాల నుంచి ఉపశమనం పొందవచ్చు.
- పలురకాల ఆయుర్వేద దగ్గు మందుల్లో తులసిని వాడుతుంటారు. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకొని నమలడం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. చక్కెర మోతాదు తగ్గించగలిగే శక్తి తులసికి ఉంది. బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది.
- రెండు స్పూన్ల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగితే పైత్యం తగ్గుతుంది. మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి ఆకుల్ని దంచి, ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తాగడం వల్ల ఉపశమనం దొరుకుతుంది.
- తులసి ఆకులను నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది. తులసి, తేనె కలిపి పరిగడుపున తీసుకోవడం వల్ల కొన్ని పోషకాలు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
- తులసి ఆకులు తినడం గుండెకు చాలామంచిది. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. తులసి, తేనె రెండింటిలోనూ యాంటీ సెప్టిక్‌ గుణాలు ఎక్కువ. ఈ రెండింటినీ కలిపి తరచూ తీసుకుంటే చర్మ సమస్యలు రావు.


logo
>>>>>>