శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Health - Jan 08, 2020 , 15:43:32

తలనొప్పిగా ఉందా?

తలనొప్పిగా ఉందా?

తలనొప్పితో నేటితరం సతమతమవుతున్నారు. కారణం ఏదైనా తలకు పనిపడుతుంది. అందుకు సరైన కళ్ళద్దాలు వాడుతున్నా ఒక్కోసారి పరిష్కారం దొరకడం లేదు. అసలు తలనొప్పి ఎందుకు వస్తుంది? ఏ భాగంలో వస్తుందో కనుక్కోండి.

-మైగ్రేన్‌ తలనొప్పి ఆత్మహత్యకు కూడా ప్రేరేపించేంత శక్తిమంతమైంది. ఇది ఒకసారి మొదలైతే కొన్నిరోజుల వరకు వెంటాడుతుంటుంది. తల కుడి, ఎడమ భాగంలో వస్తుంది. చిన్న శబ్దాలకు, కాంతికి ప్రభావం చూపుతుంది. దీంతో వికారం, వాంతులు మొదలవుతాయి. నొప్పి తీవ్రస్థాయికి చేరకముందే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
-టెన్షన్లు, పనిఒత్తిడి వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అయితే ఇది ఎక్కువసేపు ఉండదు. అలా అని ఆ కొన్ని నిమిషాలు భరించలేని తలనొప్పిని తట్టుకునేందుకు దగ్గర్లోని దుకాణానికి వెళ్లి టాబ్లెట్‌ తీసుకొని వేసుకోవాలి. అయినా తగ్గకుంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
-సైనస్‌ తలనొప్పి ముక్కు, నుదిటి వెనుక (కళ్ల కింద), కంటి దిగువ భాగంలో ఎముకల వెనుక నొప్పిని కలిగిస్తుంది. అదనంగా పొత్తి కడుపులో నొప్పి, కొరికేటప్పుడు పై దంతాలలో సలుపు, ఆ సమయంలో వాసన కూడా పసిగట్టలేకపోవచ్చు.
-చప్పట్లు కొట్టినప్పుడు శబ్దం, విస్ఫోటనం చెందుతున్నప్పుడు పిడుగు తలనొప్పి ఆకస్మాత్తుగా బాధాకరమైన తలనొప్పిగా అదృశ్యమవుతుంది. దీంతో పక్షవాతం, మెదడులో రక్తస్రావం, రక్తనాళాల చీలిక, మెదడులో ఇన్ఫెక్షన్‌, మెదడులో రక్తప్రవాహాన్ని అడ్డుకోవడం లాంటివి జరుగుతాయి.
-సాధారణంగా క్లస్టర్‌ తలనొప్పి కళ్లవెనుక భాగంలో కనిపిస్తుంది. నొప్పి ఉన్నప్పుడు కళ్లు ఎర్రబడడం, రెప్పపాటు, చెమట, కండ్లవాపు కనిపిస్తాయి. ముక్కునుంచి, కళ్లనుంచి నీరు కారుతుంది. కొంతమందిలో ఇది రోజుకు నాలుగుసార్లు కనిపిస్తుంది. ఇది మహిళలకంటే పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.


logo