శరీరంలో వేడిని తగ్గించే ఎఫెక్టివ్ చిట్కాలు..!


Sun,May 20, 2018 07:07 PM

ఎండాకాలంలో స‌హజంగానే ఎవ‌రి శ‌రీరంలో అయినా వేడి ఉంటుంది. ఇక బ‌య‌ట తిరిగిన‌ప్పుడు ఏమాత్రం ద్ర‌వాలు తాగ‌క‌పోయినా శ‌రీరం వేడెక్కుతుంది. ఫ‌లితంగా ఎండ దెబ్బ తాకుతుంది. ఇక ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నా లేదా మ‌సాలా ఆహారాలు తిన్నా, మ‌ద్యం సేవించినా శ‌రీరంలో వేడి చేరుతుంది. దీంతో శ‌రీరంపై ఆయా భాగాల్లో ద‌ద్దుర్లు, దుర‌ద‌లు వ‌స్తాయి. కొన్ని చోట్లు కురుపులు ఏర్ప‌డుతాయి. కొంద‌రికి మూత్రంలో మంట వ‌స్తుంది. కొంద‌రికి ముక్కుల్లో నుంచి ర‌క్తం కారుతుంది. ఇలా.. వేడి చేస్తే అనేక మందికి అనేక ర‌కాలుగా ఆయా స‌మస్య‌లు వ‌స్తుంటాయి. అయితే ఇలాంటి వారు కింద చెప్పిన విధంగా ప‌లు చిట్కాలు పాటిస్తే దాంతో శ‌రీరంలోని వేడిని ఇట్టే త‌గ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఒక టీస్పూన్ కరక్కాయ పొడిని తీసుకొని అందులో అర టీస్పూన్ చ‌క్కెర‌ కలిపి ఉదయం పూట ప‌ర‌గ‌డుపునే తీసుకుంటే శరీరంలో వేడి తగ్గిపోతుంది.

2. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను ఎక్కువగా తీసుకున్నా శ‌రీరంలో ఉండే వేడిని త‌గ్గించుకోవ‌చ్చు.

3. వెన్న తీసిన మజ్జిగను తీసుకుంటుంటే వేడి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

4. ఎప్పటికప్పడు చల్లటి నీరు తాగడం వల్ల కూడా శరీరం వేడి నుండి ఉపశమనం పొందుతుంది.

5. రోజులో రెండు లేదా మూడు సార్లు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శ‌రీరంలోని వేడిని త‌గ్గించుకోవ‌చ్చు.

6. పల్చటి మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు వేసుకొని తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది.

7. పుచ్చకాయ తినటం వలన చాలా త్వరగా శరీరంలోని వేడి తగ్గుతుంది.

8. ఒక స్పూన్ మెంతులను ఏదో ఒక రూపంలో ప్రతి రోజు తీసుకోవాలి. దీంతో వేడి బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు.

9. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాలలో తేనె కలిపి రోజూ తాగుతుంటే వేడి బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

10. వంటకాలలో కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ వాడితే మంచిది. ఇవి శ‌రీరంలో వేడి ఏర్ప‌డ‌కుండా చేస్తాయి.

11. రోజు ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగితే శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. వేడి ద‌రి చేర‌దు.

12. గసగసాలు శరీరాన్ని చల్లబ‌రచడానికి బాగా పని చేస్తాయి. వీటి పొడిని పాల‌లో క‌లిపి తీసుకుంటే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

12440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles