ఆదివారం 25 అక్టోబర్ 2020
Health - Sep 25, 2020 , 12:06:27

బాలిక కంట్లోంచి నీటికి బ‌దులుగా ర‌క్తం.. వైద్యుల‌కు కూడా అంతుచిక్క‌డం లేదు!

బాలిక కంట్లోంచి నీటికి బ‌దులుగా ర‌క్తం.. వైద్యుల‌కు కూడా అంతుచిక్క‌డం లేదు!

ప్రాణం ఉన్న ఏ జీవి అయినా ఏడిస్తే కంటిలోంచి నీరు వ‌స్తుంది. కానీ ఈ బాలిక కంటిలోంచి ర‌క్తం కారుతుంది. అయితే ఇది ఏడ‌వ‌డం వ‌ల్ల‌ కార‌డం లేదు. సంతోషంగా, మామూలుగా ఉన్నా కూడా కంట్లోంచి ర‌క్తం కారుతుంది. బ్రెజిల్‌కు చెందిన 11 ఏండ్ల డోరిస్ అనే బాలిక స‌డ‌న్‌గా అనారోగ్యానికి గురైంది. తీవ్ర‌మైన క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతుంటే త‌ల్లిదండ్రులు సావో పాలోని హాస్పిటల్‌లో చేర్చారు. వైద్యులు అమ్మాయికి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఫ‌లితంగా కిడ్నీల్లో రాళ్లున్నాయ‌ని చెప్పారు. ఆరోగ్యం కుదుట‌ప‌డేస‌రికి ఇంటికి పంపించేశారు. త‌ర్వాత కొన్నిరోజుల‌కు అమ్మాయి మ‌ళ్లీ అస్వ‌స్థ‌త‌కు గురైంది. ఎడ‌మ కంటి నుంచి ర‌క్తం కారుతూనే ఉండ‌డంతో ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు.

ఈ స‌మ‌స్య ఏంట‌నేది వైద్యుల‌కు అంతుచిక్క‌లేదు. దీని కార‌ణంగా ఆమెకు ఎలాంటి నొప్పి, బాధ లేక‌పోవ‌డంతో ఇంటికి పంపించేశారు వైద్యులు. ఇంటికి వ‌చ్చిన రెండు రోజుల‌కు కుడి కంటిలో కూడా ర‌క్తం కార‌డం మొద‌లైంది. దీని ట్రీట్‌మెంట్‌కు ఎంత ఖ‌ర్చు అయినా భ‌రిస్తాం. స‌రైన ట్రీట్‌మెంట్ ఇవ్వ‌డంటూ అమ్మాయి త‌ల్లి చెప్పుకొచ్చింది. ఈ స‌మ‌స్య‌కు అఫ్తాల్మోలాజిస్ట్ 'రాఫెల్ ఆంటోనియో బార్బోసా డెల్సిన్' స్పందించారు. ‘‘కన్నీటిలో రక్తాన్ని ‘హెమలాక్రియా’ అంటారు. ఈ స‌మ‌స్య‌కు కార‌ణం తెలియ‌కుండా ట్రీట్‌మెంట్ చేయ‌లేం. అయితే ఇలాంటి స‌మ‌స్య‌లు తాత్కాలికంగా ఉంటాయి. కొన్నిసార్లు శ‌రీర‌త‌త్వం వ‌ల్ల కూడా ఇలా జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. ఈ సమస్యను యాంటిబయోటికెక్స్, హర్మనల్ రెమిడీస్ సాయంతో చికిత్స అందించవచ్చు.’’ అని తెలిపారు. మ‌రి ఈ అమ్మాయికి ఎప్పుడు స‌మ‌స్య‌ను అదిగ‌మిస్తుందో ఏంటో చూడాలి మ‌రి. 


logo