దాల్చిన చెక్క‌తో ఏయే అనారోగ్యాలు న‌య‌మ‌వుతాయంటే..?


Sun,November 11, 2018 02:41 PM

దాల్చిన చెక్క‌ను నిత్యం మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తుంటాం. ముఖ్యంగా నాన్‌వెజ్ వంటల్లో మ‌సాలా రుచి కోసం దాల్చిన చెక్క‌ను వేస్తారు. దీని వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. కొంద‌రు టీలో దాల్చిన చెక్క‌ను వేసి తాగుతారు. అయితే ఇవే కాకుండా దాల్చిన చెక్క‌తో ఇంకా మ‌న‌కు ఎలాంటి ఉప‌యోగాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. దాల్చిన చెక్కను నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరి నుదురుకు పట్టిలాగా వేస్తే జలుబువల్ల వచ్చే తలనొప్పి వెంటనే తగ్గుతుంది.

2. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఒక కప్పు నీటిలో మూడు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనె కలిపి రోజుకు మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది.

3. చిటికెడు దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలిపి రాత్రిపూట పడుకునేముందు సేవిస్తే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది.

4. గుండె పట్టేసినట్లుగా అనిపిస్తుంటే దాల్చిన చెక్క చూర్ణం, యాలకుల పొడి సమపాళ్ళలో నీటిలో కలుపుకొని కషాయంలాగా కాచి తాగితే గుండె బిగపట్టడం తగ్గుతుంది.

5. దాల్చిన చెక్క కషాయం తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి.

6. కాస్తంత తేనెను వేడిచేసి అందులో ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని కలిపి రోజుకు మూడు పూటలా తీసుకున్నా లేదా ఇదే మిశ్రమాన్ని శరీరానికి పూసినా దురదలు, ఎగ్జిమా, పొక్కులు లాంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులను అరికట్టవచ్చు.

7. బియ్యం కడిగిన నీటిలో మూడు గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే మహిళలను వేధించే అధిక రుతుస్రావ సమస్య నుండి బయటపడొచ్చు.

8. పది గ్రాముల దాల్చిన చెక్క పొడి, పావు టీస్పూన్‌ దాల్చిన చెక్క నూనె కలిపి సేవిస్తే విపరీతమైన కడుపునొప్పితో బాధపడే వారికి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

9. పది గ్రాముల దాల్చిన చెక్క పొడిని పావు లీటర్‌ వేడి నీటిలో రెండు గంటలపాటు ఉంచి ఆపై దాన్ని వడగట్టి సగ భాగం చొప్పున రోజుకు రెండుసార్లు సేవిస్తే నీళ్ల విరేచనాలను అరికట్టవచ్చు.

10. మొటిమలతో బాధపడేవారు దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి రాసుకుంటే తగ్గుముఖం పడతాయి.

7563

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles