హిమాల‌య ఉప్పు మీకు తెలుసా..? దాన్ని వాడ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలివే..!


Mon,July 9, 2018 06:18 PM

నిత్యం మ‌నం వంట‌కాల్లో వేసేది అయొడిన్ ఉప్పు. అంటే అందులో అయొడిన్ ఉంటుంద‌న్న‌మాట‌. అలాగే స‌ముద్రపు ఉప్పును కూడా కొంద‌రు వాడుతారు. ఇక ఇవేకాకుండా మ‌న‌కు హిమాల‌య ఉప్పు కూడా ప్ర‌స్తుతం మార్కెట్‌లో ల‌భిస్తున్న‌ది. హిమాల‌య ఉప్పు అంటే హిమాల‌య అనే కంపెనీ త‌యారు చేసింది కాదు. హిమాల‌యాల్లో సేక‌రించిన ఉప్పు. ఇది మ‌నం వాడే సాధార‌ణ ఉప్పు క‌న్నా ఎంతో మేలు చేస్తుంది. ఈ ఉప్పులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే 84 సూక్ష్మ పోష‌కాలు ఉంటాయి. దీన్ని వాడ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. హిమాల‌య‌న్ ఉప్పులో స‌హ‌జ సిద్ధ‌మైన అయోడిన్ ఉంటుంది. ఇది మ‌న‌కు ఎంత‌గానో అవ‌స‌రం. థైరాయిడ్‌, గొంతు సంబంధ వ్యాధులు రాకుండా ఉండేందుకు అయోడిన్ ఉప‌యోగ‌ప‌డుతుంది. కానీ మ‌నం వాడే ఉప్పులో కృత్రిమంగా అయోడిన్ క‌లుపుతారు. క‌నుక అది మ‌న‌కు మంచిది కాదు.

2. స‌ల్ఫేట్‌, మెగ్నిషియం, కాల్షియం, పొటాషియం, బైకార్బ‌నేట్‌, బ్రోమైడ్‌, బోరేట్‌, స్ట్రాంటియం వంటి దాదాపు 80కి పైగా విశిష్ట‌మైన మిన‌ర‌ల్స్ హిమాల‌య‌న్ సాల్ట్‌లో ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌రం. ఇవి గుండె జ‌బ్బులు రాకుండా చూస్తాయి.

3. హిమాల‌యన్ ఉప్పును నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో శ‌రీరంలో ఎల‌క్ట్రోలైట్ బ్యాలెన్స్ పెరుగుతుంది. త‌ద్వారా ద్ర‌వాలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. శ‌రీరం ఎల్ల‌ప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఎండ దెబ్బ కొట్టేందుకు అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంది.

4. శ‌రీరంలో ఎల్ల‌ప్పుడూ ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉండ‌డం వ‌ల్ల విష ప‌దార్థాలు అన్నీ బ‌య‌టికి వెళ్లిపోతుంటాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రం అవుతుంది.

5. స‌హ‌జ సిద్ధ‌మైన ఆల్క‌లైన్ గుణాలు ఉండ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో గ్యాస్, అసిడిటీ వంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కాకుండా ఉంటాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

6. కండ‌రాలు ప‌ట్టేయ‌కుండా ఉంటాయి. శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. త‌ద్వారా క్యాల‌రీలు అధికంగా ఖ‌ర్చ‌యి బ‌రువు త‌గ్గుతారు.

7. ఎముక‌ల‌కు కాల్షియం అందుతుంది. త‌ద్వారా అవి ప‌టిష్టంగా మారుతాయి. విరిగిన ఎముక‌లు ఉన్న‌వారు ఈ ఉప్పును వాడితే త్వ‌ర‌గా ఎముక‌లు అతుక్కునేందుకు అవ‌కాశం ఉంటుంది.

8. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె స‌మ‌స్య‌లు రావు.

9. పేగులు ఆహార ప‌దార్థాల్లో ఉండే పోష‌కాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా గ్ర‌హిస్తాయి. దీంతో శ‌రీరానికి పోష‌కాహార లోప స‌మ‌స్య రాదు.

10. శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. స్త్రీల‌లో రుతు సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.

ఈ హిమాల‌య‌న్ సాల్ట్‌ను సాధార‌ణ ఉప్పులా ఎక్కువ వాడాల్సిన ప‌నిలేదు. సాధార‌ణ ఉప్పును మ‌నం ఒక టీస్పూన్ వాడే బ‌దులు అందులో 1/4 వంతు హిమాల‌య‌న్ సాల్ట్‌ను వంట‌ల్లో వాడితే చాలు. దీంతో పైన చెప్పిన ఫ‌లితాలు క‌లుగుతాయి. ఇక ఈ ఉప్పు మ‌న‌కు ప్ర‌స్తుతం అనేక స్టోర్స్‌లో ల‌భిస్తున్న‌ది.

5084

More News

VIRAL NEWS