మ‌న‌కు క్యాన్స‌ర్లు వ‌చ్చేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలు ఇవే తెలుసా..?


Tue,February 13, 2018 06:02 PM

క్యాన్సర్.. ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని ఈ వ్యాధి కబళిస్తున్నది. ఏటా వక్షోజాల క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, మూత్రాశయం క్యాన్సర్, మూత్రపిండాల క్యాన్సర్, చర్మ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్ల బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. ఏటా ఈ క్యాన్సర్లు సోకిన కొత్త కేసులు కూడా బయట పడుతున్నాయి. అయితే ఏ క్యాన్సర్‌ను అయినా ఆరంభ దశలో గుర్తిస్తేనే మంచిది, వీలున్నంత త్వరగా చికిత్స తీసుకుని ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవచ్చు. ఈ క్రమంలోనే నిత్యం మనం తీసుకునే ఆహారం, పాటించే కొన్ని అలవాట్లు, వాడే వస్తువులు క్యాన్సర్‌ను తెచ్చి పెడతాయి. మరి మనకు క్యాన్సర్‌ను కలిగించే ఆ అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ఎయిర్ ఫ్రెషనర్లు


నేటి తరుణంలో చాలా మంది ఇండ్లలో, ఆఫీసు కార్యాలయాల్లో సువాసనలు వెదజల్లేందుకు ఎయిర్ ఫ్రెషనర్లను వాడుతున్నారు. నిజానికి వీటిని వాడడం వల్ల వీటిల్లో ఉండే కెమికల్స్ ముక్కు ద్వారా మన శరీరం లోపలికి ప్రవేశించి క్యాన్సర్‌ను తెచ్చి పెడతాయని పరిశోధనల్లో తేలింది. కనుక ఎయిర్ ఫ్రెషనర్లను వాడకపోవడమే మంచిది.

2. మద్యం


విపరీతంగా మద్యం సేవించే వారిలో పెద్ద పేగు క్యాన్సర్, పురీష నాళ క్యాన్సర్, ఆహార నాళం, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. కనుక మద్యం అలవాటును మానుకుంటే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే పొగ తాగ‌డం, గుట్కా, పాన్ మ‌సాలా వంటివి తిన‌డం వ‌ల్ల కూడా క్యాన్సర్లు వ‌స్తాయి.

3. గర్భనిరోధక మాత్రలు


గర్భనిరోధక మాత్రలు వాడే స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు గర్భాశయం, కాలేయ క్యాన్సర్‌లు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

4. క్యాండిల్స్


క్యాండిల్స్‌లో ఉండే మైనం కరగడం వల్ల విడుదలయ్యే పొగలో ప్రమాదకరమైన కార్సినోజెన్లు అనబడే రసాయనాలు ఉంటాయి. ఇవి మన శరరీం లోపలికి వెళితే క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

5. వాహనాల పొగ


వాహనాల్లో ప్రధాన ఇంధనాలుగా వాడే పెట్రోల్, డీజిల్ వంటి వాటిని మండించినప్పుడు విడుదలయ్యే పొగలో కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎక్కువ కాలం పాటు పీలుస్తూ పోతే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

6. కాస్మొటిక్స్


పలు రకాల కాస్మొటిక్స్‌లోనూ క్యాన్సర్‌ను కలిగించే రసాయనాలు ఉంటాయి. అవి చర్మ సంబంధ క్యాన్సర్‌ను తెచ్చి పెట్టేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.

7. కాల్చిన ఆహారం


చాలా మంది గ్రిల్ చేయబడిన చేప, కోడి, మటన్ వంటి మాంసాహారాలను తినేందుకు ఇష్టపడతారు. అయితే ఇవి రుచిగానే ఉంటాయి, కానీ అక్కడక్కడా కాలిపోయి నల్లగా ఉంటాయి. దీని వల్ల ఆ నల్లగా ఉండే ప్రదేశంలో కెమికల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అలా కాల్చిన ఆహారాన్ని తింటే సదరు కెమికల్స్ మన శరీరంలోకి వెళ్లి జీర్ణాశయ, పెద్ద పేగు, పాంక్రియాటిక్ క్యాన్సర్‌లు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.

8. నిల్వ ఉంచిన ఆహారం


చాలా మంది రోజుల తరబడి ఆహారాన్ని నిల్వ ఉంచి దాన్ని మళ్లీ వేడి చేసుకుని తింటూ ఉంటారు. ఇలా చేయడం ప్రమాదకరం. క్యాన్సర్లను తెచ్చి పెడుతుంది. ముఖ్యంగా డీఎన్‌ఏ మార్పులు చెందడంతోపాటు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

9. శీతల పానీయాలు


సోడా, కూల్ డ్రింక్స్ వంటి శీతల పానీయాలు పాంక్రియాటిక్ క్యాన్సర్‌ను కలిగిస్తాయి. ఎన్నో అధ్యయనాలు ఇదే విషయాన్ని రుజువు చేశాయి కూడా. కనుక శీతల పానీయాలను ఎక్కువగా తాగేవారు జాగ్రత్త పడాల్సిందే. వీటి వల్ల మూత్రాశయ క్యాన్సర్ వచ్చేందుకు కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది.

10. సన్ స్క్రీన్ లోషన్


చాలా మంది ఎండలో బయటకు వెళితే చర్మం సురక్షితంగా ఉండేందుకు గాను సన్ స్క్రీన్ లోషన్ రాసుకుని మరీ బయటకు వెళ్తారు. అయితే నిజానికి ఈ లోషన్లలో జింక్ ఆక్సైడ్ అనే ప్రమాదకర రసాయనాన్ని కలుపుతారు. ఇది మన శరీరంలో డీఎన్‌ఏకు నష్టం కలిగిస్తుంది. దీంతోపాటు క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది.

10003

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles