హైబీపీ ఉందని తెలియజేసే పలు ముఖ్యమైన లక్షణాలు ఇవే తెలుసా..?


Mon,October 8, 2018 04:22 PM

హై బ్లడ్ ప్రెషర్.. దీన్నే హైపర్‌టెన్షన్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక సైలెంట్ కిల్లర్. చాప కింద నీరులా వస్తుంది. దీన్ని సరైన సమయంలో గుర్తించి అందుకు తగిన విధంగా వైద్యులచే చికిత్స తీసుకోవాలి. లేదంటే గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే కింద సూచించిన పలు అనారోగ్య లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తుంటే వాటిని హై బీపీకి చిహ్నాలుగా భావించాలి. వారు హైబీపీతో బాధపడుతున్నట్లే భావించాలి. అలాంటి వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యున్ని కలవాలి.

హైబీపీ ఉందని తెలిపే పలు లక్షణాలు ఇవే..!

హైబీపీ ఉంటే ఛాతిలో నొప్పి వస్తుంటుంది. మగతగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. నీరసంగా అనిపిస్తుంది. చూపు మసగ్గా ఉంటుంది. కొందరికి మూత్రంలో రక్తం పడుతుంది. తీవ్రమైన అలసట ఉంటుంది. ఆందోళన, గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం, తలనొప్పి, ముక్కు నుంచి రక్తం కారడం వంటివన్నీ హైబీపీ లక్షణాలే. వీటితో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వెంటనే డాక్టర్‌ను కలిసి సకాలంలో చికిత్స తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.

హైబీపీ రాకుండా ఉండాలంటే పాటించాల్సిన పలు జాగ్రత్తలు...
1. నిత్యం పని ఒత్తిడి సహజంగానే ఎవరికైనా ఉంటుంది. కానీ వీలైనంత వరకు ఆ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీర్ఘకాలం ఒత్తిడి బారిన పడితే అది హైబీపీకి దారి తీస్తుంది. లేదా హైబీపీ ఉన్నవారికి సమస్య మరింత తీవ్రతరమవుతుంది. కనుక హైబీపీ తగ్గాలంటే నిత్యం ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందుకు యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం, పుస్తకాలు చదవడం, మనస్సుకు నచ్చిన సంగీతం వినడం చేయాలి.

2. డయాబెటిస్ ఉన్నవారికి హైబీపీ వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. కనుక డయాబెటిస్ రాకుండా చూసుకోవాలి. వచ్చిన వారు తమ జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. నిత్యం ఒకే సమయానికి క్రమం తప్పకుండా భోజనం చేయాలి. వేళకు నిద్ర పోవాలి. వ్యాయామం చేయాలి. అలాగే ధూమపానం, మద్యపానం మానేయాలి.

3. అధిక బరువు ఉన్నవారు కూడా హైబీపీ బారిన పడతారు. అలాంటి వారు బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 20 నుంచి 25 మధ్యలో ఉండేలా చూసుకోవాలి. 25 దాటితే హైబీపీ వచ్చే రిస్క్ పెరుగుతుంది.

4. నిత్యం కచ్చితంగా కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. దీని వల్ల గుండె కండరాలు దృఢంగా ఉంటాయి. హైబీపీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

5. పాలు, పాల సంబంధ పదార్థాలు, తాజా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారాలను తింటుంటే హైబీపీ రాకుండా ఉంటుంది.

6889
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles