స్క్రీన్ టైమ్.. ప్రతి ఒక్కరినీ కంగారు పెడుతున్న మాట. మొబైల్, కంప్యూటర్, టీవీ తెరలకు మనం అంకితమయ్యే సమయాన్నే ‘స్క్రీన్ టైమ్’ అంటాం. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని, మన మెదడు పనితీరును కూడా ఇది ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలోని
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రతినిధులు మరో హెచ్చరిక కూడా చేస్తున్నారు. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల మీద సైతం స్క్రీన్ టైమ్ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు. ఇందుకోసం నాలుగు వందల మంది పిల్లలమీద ఓ పరి
శోధన చేశారు. 6 నుంచి 7 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఈ పిల్లల్లో.. రోజుకు రెండు గంటల స్క్రీన్ టైమ్ ఉన్నవారి ఐక్యూ చాలా తక్కువ స్థాయిలో ఉండటం గమనించారు. ఉద్వేగాల అదుపు,
ఏకాగ్రత, సమస్యలను పరిష్కరించడం.. తదితర విషయాల్లో తీవ్రమైన వెనుకబాటు కనిపించింది. బెడ్రూమ్లో టీవీ ఉన్న పిల్లల్లోనూ ఈ తరహా సమస్యలు బయట పడ్డాయి. కాబట్టి, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి.