e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home ఆరోగ్యం పొద్దున్నే తీపికబురు!

పొద్దున్నే తీపికబురు!

పొద్దున్నే తీపికబురు!

చాక్లెట్‌… ఒకేసారి సంతోషం, బాధ కలిగించే వింత పదం. దాన్ని తినడం చాలామందికి ఇష్టమే. చాక్లెట్‌ తినడం వల్ల ఉత్పత్తి అయ్యే హార్మోన్లవల్ల సంతృప్తి లభిస్తుంది. ఆ సంతృప్తి కోసమే మళ్లీమళ్లీ చాక్లెట్‌ తినాలనిపిస్తుంది. సాంకేతికంగా చూస్తే ఇదో వ్యసనమే! మరోవైపు చాక్లెట్‌ తింటే బరువు పెరుగుతారని, లివర్‌ లాంటి అవయవాల మీద దుష్ప్రభావం ఉంటుందనీ వింటున్నాం. అయితే ఈమధ్య జరిగిన ఓ పరిశోధన ‘చాక్లెట్‌ ఎలా తిన్నామన్నది కాదు భయ్యా! ఎప్పుడు తిన్నామన్నదే ముఖ్యం’ అని పంచ్‌ విసురుతున్నది. రుతుక్రమం ఆగిపోయిన (మెనోపాజ్‌) కొందరు మహిళల మీద జరిగిన ఈ పరిశోధనలో… ఉదయం లేచిన తర్వాత ఓ గంటలోపు కనుక చాక్లెట్‌ తింటే, దానివల్ల చెడు జరగదని తేల్చారు. ఊబకాయం రావడం లేదు సరికదా, ఒంట్లో ఉన్న కొవ్వు కూడా కరిగిపోవడాన్ని గమనించారు. అలాగని చాక్లెట్‌ తినమనీ ఈ పరిశోధన సిఫారసు చేయడం లేదు. మనం తినే ఆహారం, వేర్వేరు సమయాల్లో విభిన్నమైన ప్రభావాల్ని చూపుతుందని తెలుపడమే ఈ అధ్యయనం ఉద్దేశమని చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పొద్దున్నే తీపికబురు!
పొద్దున్నే తీపికబురు!
పొద్దున్నే తీపికబురు!

ట్రెండింగ్‌

Advertisement