e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 23, 2022
Home News Popcorn | పాప్‌కార్న్ తింటే ఇన్ని లాభాలా.. అవేంటో తెలిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..

Popcorn | పాప్‌కార్న్ తింటే ఇన్ని లాభాలా.. అవేంటో తెలిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..

popcorn health benefits | చల్లని సాయంత్రం సరదాకైనా, చినుకుల వేళ కాలక్షేపానికైనా ఠక్కున గుర్తొచ్చేది.. పేలాలు. స్నేహితుల కబుర్లకు తోడు, ప్రేమికుల ఊసులకు జోడు.. పాప్‌ కార్న్‌. అల్లరి పిల్లలకు తల్లుల తాయిలం, సినిమా ఎలా ఉన్నా ‘ఫీల్‌ గుడ్‌’ ఫీలింగ్‌ కలిగించే రుచి కూడా ఇదే. కాబట్టే, పాప్‌కార్న్‌ను ‘బాప్‌ ఆఫ్‌ ఆల్‌ స్నాక్స్‌’గా తీర్మానించారు.

popcorn health benefits
popcorn health benefits

తెలంగాణలో మక్క పేలాలంటే తెలియనివారు ఉండరు. నాలుగు చినుకులు పడినా, ఏం తోచకపోయినా, ఏదో ఒకటి తినాలనిపించినా .. పొయ్యి మీద మంగళం (మట్టికుండ) ఎక్కాల్సిందే.
పేలాలు చిటపటా వేగాల్సిందే. పేలాల కోసం ప్రత్యేకంగా పండించే మక్కలను సేకరించి, ఏడాదిపాటు నిల్వచేసుకుని మరీ ఆరగిస్తారు.

- Advertisement -

కొందరు ఆహార ప్రియులు ‘జెమ్స్‌’ సాయంతో రంగు రంగుల పాప్‌కార్న్‌ ఇంద్రధనుస్సు (రెయిన్‌బో) సృష్టిస్తున్నారు. మరికొందరు అడుగు ముందుకేసి వైట్‌ చాక్లెట్‌ జోడించి పాప్‌కార్న్‌ కేక్‌లూ తయారు చేస్తున్నారు. డ్రై ఐస్‌ పాప్‌కార్న్‌ అయితే, ఈటింగ్‌ చాలెంజ్‌ పేరుతో ఓ కార్యక్రమంగా నెట్టింట కూడా వైరలయ్యింది.

popcorn health benefits
popcorn health benefits

‘పాప్‌కార్న్‌’ అంటూ ఇప్పుడు స్టైల్‌గా పిలుస్తున్నా పూర్వం నుంచీ ఉన్న పేరు.. పేలాలు. పచ్చని మక్కల్లోంచి మల్లెపూలు విచ్చుకున్నట్టు కంటికి ఇంపుగా కనిపించే పేలాలకు కాస్త పసుపు, ఉప్పు చిలకరిస్తే ఆ రుచికి తిరుగే ఉండదు. ఆపైన కాస్త కారం, చాట్‌ మసాలా జోడిస్తే సాయంత్రాలు మంత్రమేసినట్టు కరిగిపోతాయి.

ఎముకల బలానికి అవసరమైన లవణాలు మక్కజొన్నలో పుష్కలం. పసుపు రంగులోని ఈ గింజలలో మినరల్స్‌ అధికంగా ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్పరస్‌ వంటివి ఎముకలు గట్టిపడేలా చేస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచటంలోనూ సాయపడతాయి.

popcorn health benefits
popcorn health benefits

పోషకాల పరంగానూ పేలాలు తక్కువేం కాదు. వీటిలోని కార్బొహైడ్రేట్స్‌ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. పకాపకా నమిలేయడం వల్ల దవడ ఎముకలకు చక్కటి వ్యాయామం. మక్కజొన్నలో చక్కెర తక్కువ. మధుమేహంతో బాధపడేవారు నిశ్చింతగా తినవచ్చనేది నిపుణుల మాట.

బెల్లం పాకంతో చేసే పేలాల ముద్దలు నిన్నమొన్నటి బాల్యానికి బ్రహ్మాండమైన చిరుతిండి. పేలాల ముద్దల కోసం తోబుట్టువుల మధ్య యుద్ధాలు జరిగేవి. అమ్మానాన్నల చేతిలో తన్నులూ పడేవి. అయినా సరే, పేలాల ముద్ద కోసం పోరాటం ఆగేది కాదు. పాత ఫార్ములాను ఉపయోగిస్తూ బెల్లానికి బదులు చాక్లెట్‌ జోడించి క్యారమెల్‌ పాప్‌కార్న్‌ అంటూ కొత్తగా వడ్డిస్తున్నారు మల్టీప్లెక్స్‌లలో.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

వంటింట్లో ఉండే వీటిని కూర‌ల‌తో తీసుకుంటే ఇంత మేలు జ‌రుగుతుందా?

ఉల్లి, వెల్లుల్లి..వీటిని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనా?

ఈ కాయ‌తింటే షుగ‌ర్ కంట్రోల్‌.. మ‌ల‌బ‌ద్ధ‌కానికి చెక్..!!

ఆకాశ‌న్నంటిన ట‌మాటా ధ‌ర‌లు.. ట‌మాట బ‌దులు కూర‌ల్లో వీటిని ట్రై చేయండి

cancer risk | ఈ గింజ‌లు తింటే క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకోవ‌చ్చు

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement