నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32316 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 9633 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 7436 క్యూసె క్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33982 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
వరద కాల్వ ద్వారా నీటి విడుదల లేదు. రిజర్వా యర్ నుంచి 85167 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా, అదే స్థాయిలో ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు ప్రస్తుతం 883.90 అడుగులు (209.5948 టీఎంసీలు) ఉంది. శ్రీశైలంకు 33946 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.