నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 10 క్రస్ట్ గేట్ల ద్వారా 108230 క్యూసెక్కుల నీటిని విడుదలను దిగువకు కొనసాగిస్తు న్నారు. రిజర్వా యర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.70 (311.14 86 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 9217 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8629 క్యూసెక్కు లు, ఎస్ఎల్బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 29029 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
వరద కాల్వ ద్వారా నీటి విడుదల లేదు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 157505 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొన సాగుతుండగా, అదే స్థాయిలో ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 884.80 అడుగులు ( 214.3637 టీఎంసీలు) ఉంది. శ్రీశైలంకు 147825 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.