అసలే ఎండాకాలం. మనుషులే కాదు జంతువులు కూడా దాహంతో అల్లాడుతున్నాయి. అలా గుక్కెడు నీటి కోసం పరితపిస్తోన్న ఓ పావురానికి గరిటెతో నీరందించి దాహార్తిని తీర్చాడు ఓ చిన్నోడు. ఎండదెబ్బకు సొమ్మసిల్లి రేకుపై ఉన్న ఓ పావురానికి కిటికీ గ్రిల్ లో నుంచి గరిటెతో నీరుపోసి ప్రాణం నిలబెట్టాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మానవత్వం చూపిన బుడతడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.