చెరువులు, చెక్ డ్యామ్‌లను నింపుతూ.. ఎండుతున్న పంట పొలాలకు జీవం పోస్తూ గోదారమ్మ పరుగులు తీస్తోంది. సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉరకలెత్తుతున్నాయి.
హైదరాబాద్ డ్యాన్స్ ఫెస్టివల్ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న కళా ప్రదర్శన ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 3న ప్రారంభమైన ఈ డ్యాన్స్ ఫెస్టివల్స్‌లో భాగంగా ప్యానెల్ డిస్కషన్స్, ఫిల్మ్ స్క్రీనింగ్, డ్యాన్స్ పోటీలు, ఇంటరాక్టివ్ సెక్షన్ నిర్వహిస్తున్నారు.
హల్దీవాగు | కరువు ప్రాంతమైన గజ్వేల్ నియోజకవర్గంలో కొండ పోచమ్మ నుంచి హల్దీవాగు ద్వారా మంజీర - నిజాంసాగర్‌లోకి వచ్చిన కాళేశ్వరం గోదావరి జలాలను చూసిన వారంతా ఎంతో మురిసిపోయారు
హల్దీ వాగు | కాళేశ్వరం ప్రాజెక్ట్ మరో చరిత్ర సృష్టించింది. కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీ వాగు లోకి గోదావరి జలాలను తరలించే అద్భుత ఘట్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఆవిష్కరించారు
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో ఎయిర్ సఫారీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. వింగ్ మాస్టర్ అనే ఓ ప్రైవేటు సంస్థ గత ఏడాది నవంబర్‌లో ఎయిర్ సఫారీని ప్రారంభించింది.
కొత్తరూపుతో జిగేల్ అంటున్నట్యాంక్బండ్ అందాలు ఇప్పుడు నగరవాసులను కట్టిపడేస్తున్నాయి. కొత్తరూపుతో కనువిందు చేస్తున్న హుస్సేన్‌సాగర్‌ను చూసేందుకు వస్తున్న సందర్శకులతో సాయంత్రం వేళ ట్యాంక్‌బండ్ కిటకిటలాడుతోంది.
ఎండాకాలం వచ్చేసింది. అప్పుడే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. మండే ఎండలను చూసి జనాలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జనాలను ఆకర్షించేందుకు బ్యాంకాక్‌లోని ఓ షాపింగ్ మాల్ వినూత్న ఆలోచన చేసింది.