e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home Events Pushpa: తెలుగు చిత్రసీమ ప్రపంచంలో నంబవర్‌వన్‌ ఇండస్ట్రీల్లో ఒకటిగా నిలుస్తుంది.. పుష్ప టీజర్‌లో అల్లు అర్జున్‌

Pushpa: తెలుగు చిత్రసీమ ప్రపంచంలో నంబవర్‌వన్‌ ఇండస్ట్రీల్లో ఒకటిగా నిలుస్తుంది.. పుష్ప టీజర్‌లో అల్లు అర్జున్‌

అల్లు అర్జున్ ( Allu arjun ) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘పుష్ప’ ( pushpa ). సుకుమార్‌ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా పతాకాలపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ‘ఇంట్రడ్యూసింగ్‌ పుష్పరాజ్‌’ వీడియోను విడుదలచేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన అల్లు అర్జున్‌..  ‘నా పుట్టినరోజును అభిమానుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ కంటే గొప్ప బహుమతి నాకు ఏదీ లేదు ‘అర్య’తో నా సినీ ప్రయాణం మొదలైంది. ఆ సినిమాతో దర్శకుడు సుకుమార్‌ నాకు ైస్టెలిష్‌స్టార్‌గా పేరుతీసుకొచ్చారు. ఇప్పుడు ‘పుష్ప’తో నన్ను ఐకాన్‌స్టార్‌గా మార్చి ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారు. సుకుమార్‌ ఇచ్చిన ఈ కొత్త పేరు నాకు చాలా నచ్చింది. నాకు సంబంధించి సినిమా, పాట, టీజర్‌ ఏదయినా ముందుగా అభిమానులకు నచ్చాలనే కోరుకుంటా. ఈ టీజర్‌ అందరికి నచ్చడం ఆనందంగా ఉంది. ఇతర భాషల వారు తెలుగు సినిమాల్ని ఆదరిస్తుండటం సంతోషాన్ని కలిగిస్తోంది. వారి వల్లే తెలుగు సినిమా మార్కెట్‌ స్థాయి పెరిగింది. వచ్చే పాతికేళ్లలో తెలుగు చిత్రసీమ ప్రపంచంలోని నంబవర్‌వన్‌ ఇండస్ట్రీల్లో ఒకటిగా నిలుస్తుంది. రాబోతున్న పాన్‌ ఇండియన్‌ సినిమాల్లో ఒకటిగా ‘పుష్ప’ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందరి మనసుల్ని హత్తుకుంటుంది. నేను, దేవిశ్రీప్రసాద్‌, సుకుమార్‌ చాలా రోజుల తర్వాత కలిసి చేసిన సినిమా ఇది’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

ఫస్ట్ టైమ్ ఓ హీరో కోసం

నువ్వు తగ్గద్దు..నువ్వు ఆపద్దు

పుష్ప‌రాజ్‌గా త‌గ్గేదే లే : చిరంజీవి

స్టైలిష్ స్టార్‌ను ఐకాన్‌ స్టార్‌గా మార్చిన సుకుమార్

తగ్గేదే లే అంటూ ఫ్యాన్స్‌ను ఉత్సాహ‌ప‌ర‌చిన బ‌న్నీ

Advertisement
Pushpa: తెలుగు చిత్రసీమ ప్రపంచంలో నంబవర్‌వన్‌ ఇండస్ట్రీల్లో ఒకటిగా నిలుస్తుంది.. పుష్ప టీజర్‌లో అల్లు అర్జున్‌

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement