e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home జోగులాంబ(గద్వాల్) చదువులో సత్తా చాటుతున్న ఊర్మిల

చదువులో సత్తా చాటుతున్న ఊర్మిల

  • జాతీయ స్థాయిలో 40 వేల ర్యాంక్‌
  • వైద్య విద్యకు అడ్డంకిగా.. ఆర్థిక స్థోమత
  • సహకారం అందిస్తే చదువుతానంటున్న విద్యార్థిని

ఇటిక్యాల, నవంబర్‌ 25 : వైద్య విద్యనభ్యసించేందుకు జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్‌ పరీక్షలో మెరిసింది. మండలంలోని చాగాపురం గ్రామానికి చెం దిన ఊర్మిల ఈ టెస్ట్‌లో ర్యాంక్‌ సాధించింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి చదువులో ప్రతిభ కనబర్చుతు న్న విద్యార్థినిని పలువురు అభినందిస్తున్నారు. కానీ వై ద్య విద్య చదివేందుకు కావాల్సిన ఆర్థిక స్థోమత లేకపోవడంతో చదువుకు దూరం కావాల్సిన పరిస్థితి. ఊర్మిల తండ్రి గుమ్మన్న రోడ్డు నిర్మాణ పనుల క్వాలిటీ విభాగంలో తాత్కాలిక పద్ధతిలో చేస్తున్న ఉద్యోగరీత్యా గజ్వేల్‌కు వెళ్లాడు. అక్కడే ఊర్మిల పాఠశాల విద్యను పూర్తి చేసింది. అనంతరం సొంతూరుకు వచ్చిన తండ్రి ఎర్రవల్లి చౌరస్తాలో చిన్న హోటల్‌ నిర్వహిస్తున్నాడు. దీంతో ఆమె మహబూబ్‌నగర్‌లోని ప్రతిభ కళాశాలలో బైపీసీ చదివి 969 మార్కులు సాధించింది. దీంతో కాలేజీ యాజమాన్యం విద్యార్థిని తక్కువ ఫీజుతో నీట్‌ పరీక్షలో పాల్గొనేందుకు శిక్షణ ఇచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ టెస్ట్‌లో ఓబీసీ కోటాలో 40 వేల ర్యాం క్‌, అలాగే రాష్ట్ర స్థాయిలో 2,110 ర్యాంక్‌ సాధించింది. కాగా ప్రస్తుతం జరుగుతున్న సీట్ల కేటాయింపులో ప్ర భుత్వ, ప్రైవేటు కళాశాలలో సీటు వచ్చే అవకాశం లేకపోలేదు. కానీ ఆర్థిక పరిస్థితులు చదువకు అడ్డు వస్తున్నాయి. ఊర్మిలకు సీటు వచ్చినా చదివించే పరిస్థితులు లేవని ఆమె తండ్రి గుమ్మన్న వాపోయాడు. ఇద్దరు ఆడపిల్లలు, కొడుకు చదువు కోసం ఉన్న రెండెకరాల భూ మిని విక్రయించానని చెప్పాడు. ప్రస్తుతం చిన్నపాటి హోటల్‌ నిర్వహణతో కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిపాడు. రెండో కూతురు హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్‌ కాలేజీలో, కొడుకు ఇంటర్‌ చదువుతున్నాడన్నారు. వీరిద్దరి చదవులే భారంగా మారాయని చెప్పుకొచ్చాడు. ఎవరైనా తన బిడ్డ వైద్య విద్యకు ఆర్థికంగా సాయం చేస్తే చదివిస్తానని ఆమె తండ్రి చెప్పాడు. దాతలు ముందుకు రావాలని, తన కూతురుకు బంగారు భవిష్యత్‌ ఇచ్చేందుకు సహకరించాలని కోరుతున్నాడు. తనకు ఎవరైనా వెన్నంటే నిలిస్తే ఉన్నత శిఖరాలను అందుకుంటానని విద్యార్థిని ఊర్మిల ధీమా వ్యక్తం చేసింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement