e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home జోగులాంబ(గద్వాల్) కార్యకర్తలు సైనికుడిలా పనిచేయాలి

కార్యకర్తలు సైనికుడిలా పనిచేయాలి

  • టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేయాలి : విప్‌ గువ్వల బాలరాజు

అచ్చంపేట, సెప్టెంబర్‌ 15 : టీఆర్‌ఎ స్‌ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మె ల్యే గువ్వల బాలరాజు సూచించారు. బుధవారం అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో అన్ని మండలాల ముఖ్య నా యకులతో సమావేశమయ్యారు. గ్రామ, అనుబంధ, మండల కమిటీల ఎన్నికపై చర్చించారు. ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన పట్టణంలోని షామ్స్‌ ఫంక్షన్‌హాల్‌లో ఉద యం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆరు మండలాల కమిటీ ఎన్నిక ఉంటుందన్నారు. 10 గంటలకు బల్మూ ర్‌, 11 గంటలకు ఉప్పునుంతల, 12 గంటలకు లింగాల, 2 గంటలకు అచ్చంపేట, 3 గంటలకు పదర, 4 గంటలకు అమ్రాబాద్‌ మండల కమిటీ సమావేశం ఉంటుందన్నారు.

మండల కమిటీల వర కు మిగిలిన అనుబంధ కమిటీల ఎన్నిక పూర్తి చేయాలని, సభ్యుల ఫోన్‌ నెంబర్లు తప్పకుండా ఉండాలన్నారు. గ్రామాల్లో పార్టీ పరిస్థితి, సమస్యలపై ఆరా తీశారు. కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సీఎం రెడ్డి, ము న్సిపల్‌ మాజీ చైర్మన్‌ తులసీరాం, ఎంపీ పీ అరుణ, జెడ్పీటీసీలు ప్రతాప్‌రెడ్డి, రాంబాబు, లక్ష్మమ్మ, పీఏసీసీఎస్‌ చైర్మ న్లు నర్సయ్యయాదవ్‌, సురేందర్‌రెడ్డి, రాజీరెడ్డి, సర్పంచ్‌ లోక్యానాయక్‌, కౌన్సిలర్లు శివ, రమేశ్‌రావు, విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, చుక్కారెడ్డి, పర్వతాలు, సుల్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

డ్రైనేజీ పనులు ప్రారంభం..
పట్టణంలోని మధురానగర్‌లో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను విప్‌ గువ్వల ప్రా రంభించారు. మధురానగర్‌ నుంచి ఆదర్శనగర్‌ కాలనీలోని చైతన్య కళాశాల వర కు డ్రైనేజీ నిర్మించనున్నట్లు గువ్వల తెలిపారు. పట్టణంలో రూ.4 కోట్లతో డ్రైనేజీ పనులు మంజూరు కాగా, రూ.50 లక్షలతో పనులు ప్రారంభించామన్నారు. స మస్యలను గుర్తించి వెంటనే పరిష్కరిస్తు న్న మున్సిపల్‌ చైర్మన్‌, కమిషనర్‌, కౌన్సిలర్లను అభినందించారు. కార్యక్రమం లో మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, వై స్‌ చైర్మన్‌ శైలజ, కమిషనర్‌ శ్రీహరిరాజు, కౌన్సిలర్లు సుగుణమ్మ, రమేశ్‌రావు, ర మేశ్‌, సోమ్లానాయక్‌, ఏఈ మేఘనాథ్‌, నాయకులు మంగ్యానాయక్‌, జైపాల్‌నాయక్‌, హుస్సేన్‌, ఖలీల్‌, రాజు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana