e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home జోగులాంబ(గద్వాల్) మండపాలకూ జియోట్యాగింగ్‌

మండపాలకూ జియోట్యాగింగ్‌

  • నిఘా నీడలో గణనాథులు
  • యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్న పోలీసులు
  • అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పర్యవేక్షణ
  • కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచన

బాలానగర్‌, సెప్టెంబర్‌ 14 : వినాయక మండపాలన్నింటి వద్ద నిరంత రం నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్క డా అవాంఛనీయ ఘటనలు చోటు చే సుకోకుండా బందోబస్తు కల్పిస్తున్నా రు. కొవిడ్‌ నిబంధనలు పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. శానిటైజర్‌ ఏర్పాటుతోపాటు భక్తులు మాస్కు ధరించేలా మండపాల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. కాగా, వినాయక విగ్రహాలను పోలీసు లు జియోట్యాగింగ్‌ చేస్తున్నారు. అనుమతులు పొందిన విగ్రహాల వద్ద వివరాలు సేకరించి ట్యాబ్‌లో నమోదు చే స్తున్నారు. బాలానగర్‌ మండల వ్యా ప్తంగా 172 విగ్రహాలకు అధికారికంగా అనుమతులు ఉండగా, ఇప్పటికే అన్ని విగ్రహాలకూ జియో ట్యాగింగ్‌ పూర్తి చే శారు.

మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశా రు. జియో ట్యాగింగ్‌ చేసిన తరువాత టీఎస్‌ కాప్‌ యాప్‌లో పొందుపరుస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగిన వెం టనే ఆ మండపం అడ్రస్‌ వెతకాల్సిన అవసరం లేకుండా.. జియోట్యాగింగ్‌ ద్వారా కేవలం 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకు నే అవకాశం ఉన్నది. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎన్ని మండపాలున్నాయి..? ఎ న్ని వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించా రు..? ఎంత దూరంలో ఉన్నాయి..? అనే విషయాలు పొందుపరుస్తున్నారు. మం డపాల వద్ద ఎన్ని గంటల వరకు పూజ లు చేస్తున్నారు..? పార్కింగ్‌ సౌకర్యం ఉందా.. లేదా..? అని ఆరా తీస్తున్నారు. అనుమానిత వ్యక్తులు, వస్తువు లు కనిపించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

- Advertisement -

నిరంతరం పర్యవేక్షణ..
పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అన్ని గ్రామాల్లో పెట్రోలింగ్‌, బ్లూకో ట్స్‌, వాహనాలతో గణేశ్‌ మండపాలతోపాటు అన్ని ప్రాంతాల నూ పర్యవేక్షిస్తున్నాం. ముఖ్యంగా మం డపాల నిర్వాహకులతో సమావేశమై నవరాత్రులతోపాటు నిమజ్జనం రోజున పాటించాల్సిన జాగ్రత్తలు వివరించాం. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – వెంకటేశ్వర్లు , ఎస్సై, బాలానగర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana