e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home జోగులాంబ(గద్వాల్) అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట

అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట

  • పాలమూరు ఎత్తిపోతలతో మండలాన్ని సస్యశ్యామలం చేస్తాం
  • లబ్ధిదారులకు కొత్త రేషన్‌ కార్డులు,కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత
  • ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

ఊట్కూర్‌, జూలై 26 : తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలో తాసిల్దార్‌ తిరుపతయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభు త్వం నుంచి కొత్తగా మంజూరైన రేషన్‌ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలు ఆత్మ గౌరవంతో బతుకుతున్నారని తెలిపారు.

నోటుకు ఓటు కేసులో జైలుకెళ్లిన దొంగ రేవంత్‌రెడ్డికి టీపీసీసీ పదవీ రావడంతో కొందరు కాంగ్రెస్‌ నాయకులు కొత్త బిచ్చగాళ్లు పొద్దెరగనట్లు ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులకు, రిజర్వాయర్‌కు తేడా తెలియ ని వాళ్లు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్ని స్తే ప్రజలే తిరుగబడుతారని హెచ్చరించారు. పాలమూరు ఎత్తి పోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని జాయమ్మ చెరువు, ఊట్కూర్‌ పెద్ద చెరువుతోపాటు అన్ని గ్రామాల గొ లుసుకట్టు చెరువులకు సాగు నీరందించి సస్యశ్యామలం చే స్తామని ఆయన చెప్పారు. డెభ్భై ఏండ్ల సీమాంధ్రుల పరిపాలనలో గ్రామాల్లో కనీసం తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు దొరకని పరిస్థితి ఉండేదని సీఎం కేసీఆర్‌ సారథ్యంలో మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీటి ని అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులను నేరుగా మంజూరు చేస్తూ సర్పంచులకు పూర్తి స్థాయి అధికారాలను కట్టబెట్టిందన్నారు. ప్రభుత్వ నిధుల తో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుకోవాలని సూ చించారు.

- Advertisement -

ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్‌ కా ర్డులు, 57 ఏండ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు అందజేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. తన ఎమ్మెల్యే నిధుల నుంచి ప్రతి గ్రామానికి రూ.5 లక్షలు వెచ్చించి అభివృద్ధి ప నులు చేపడుతామన్నారు. మండలంలో 34 మందికి క ల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కొత్తగా 260 మందికి రేషన్‌కార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జె డ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్‌, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ బాల్‌రెడ్డి, సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ఎంపీడీవో కాళప్ప, డీటీ రాజగణేశ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ రాఘవేంద్రారెడ్డి, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి, టీఆర్‌ఎస్‌ మం డలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎం పీటీసీలు పాల్గొన్నారు.

సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఊట్కూర్‌, జూలై 26 : కోట్లాది రూపాయల నిధులు వె చ్చించి సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. ఎంపీపీ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామాలను ప్రగతి పథంలోకి తే వాలని సూచించారు. హరితహారంలో భా గంగా ఓబ్లాపూర్‌, ఎర్గట్‌పల్లి, అమీన్‌పూర్‌, ఎడవెల్లి, నిడుగుర్తి, పెద్దజట్రం తదితర గ్రా మాల నర్సరీల్లో మొక్కలు పెంచకపోయినా నిధులను మాత్రం ప్రతి నెలా డ్రా చేస్తున్నారని, హరితహారంపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హె చ్చరించారు. మండలంలో కొందరు పంచాయతీ కార్యద ర్శులు ఆయారాం..గయారాంలుగా వ్యవహరిస్తున్నారని ఆ గ్రహం వ్యక్తం చేశారు. పని తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వం స్థానిక సంస్థలకు యాభై శాతం రిజర్వేషన్‌ అమలుతో మహిళలకు అవకావం కల్పిస్తే మహి ళా సర్పంచుల స్థానంలో వారి భర్తలు, కుమారులు పెత్తనం చెలాయిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే హి తవు పలికారు.

అన్ని గ్రామాల్లోని వైకుంఠ ధామంలో సిం గిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎలక్ట్రిసిటీ ఏఈ వెంకటేశ్‌ను ఆదేశించారు. మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామా ల్లో చెరువులకు గండ్లు పడినా పట్టించుకోవడం లేదని ఐబీ ఏఈ వెంకటప్పను సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి సభలో నిలదీయగా పనితీరు మార్చుకోవాలని అతనిపై ఎమ్మెల్యే ఆగ్ర హం వ్యక్తం చేశారు. పెద్దజట్రంలో పశువులు అనారోగ్యాని కి గురవుతున్నప్పటికీ వీఏఎస్‌ మహదేవ్‌ వెటర్నరీ క్యాంపు నిర్వహించడం లేదని ఆ గ్రామ ఎంపీటీసీ కిరణ్‌కుమార్‌ ఆ రోపించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ వెంకటేశ్‌ నిర్లక్ష్యంతో గ్రా మాల్లో మిషన్‌భగీరథ పనులు పూర్తి కావడం లేదని పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సభలో లేవనెత్తగా నెల రోజుల్లో పనులు పూర్తి చేయించాలని ఎమ్మెల్యే ఆదేశించా రు. మండలంలోని వల్లంపల్లి, బాపురం, పులిమామిడి, కొ త్తపల్లి గ్రామాలకు వెళ్లే రహదారుల్లో వర్షానికి తెగిన కల్వర్టుల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయించాలని పీఆర్‌ ఏఈ జగత్‌చంద్రను ఆదేశించారు. ఆయా శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులను సంబంధిత అధికారులు సభలో చదివి వినిపించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్‌, తాసిల్దార్‌ తిరుపతయ్య, ఎంపీడీ వో కాళప్ప, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana