e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home జోగులాంబ(గద్వాల్) తెలంగాణ గార్డెన్‌

తెలంగాణ గార్డెన్‌

  • హరితవనంగా జడ్చర్ల బొటానికల్‌ గార్డెన్‌
  • రూ.50 లక్షలనిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌
  • ఏడాదికాలంలోనే పరుచుకున్న పచ్చదనం
  • nప్రత్యేకతతో కూడిన మొక్కల పెంపకం

జడ్చర్లటౌన్‌, జూలై 26 : జడ్చర్లలోని డాక్టర్‌ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటవుతున్న తెలంగాణ బొటానికల్‌ గార్డెన్‌ ఏడాదికాలంలోనే హరితవనంగా రూ పుదిద్దుకున్నది. ప్రత్యేకంగా రాష్ట్ర చిత్రపటం ఆకారంలో జిల్లాల వారీగా విభాగాలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతేడాది జూలై 17న కళాశాల అధ్యాపకుడు డాక్టర్‌ సదాశివయ్యను పిలిచి అభినందించారు. అంతేకాకుండా తెలంగాణ బొటానికల్‌ గార్డెన్‌ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ స్వయంగా రూ.50 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో తెలంగాణ బొటానికల్‌ గార్డెన్‌ మరింత అ భివృద్ధి చెందుతున్నది. రాష్ట్ర చిత్రపటం ఆకారంలో ఒక్కో జిల్లా విభాగంలో ఆ జిల్లాకు ప్రత్యేకత ఉన్న మొక్కలను తెచ్చి నాటారు. ఇప్పటికే 23 జిల్లాలకు సంబంధించిన మొక్కలు తెచ్చి నాటారు. మిగతా జిల్లాల విభాగాల్లో మొక్కల పెంపకంపై దృష్టిసారించారు. మొక్కలకు క్యూఆర్‌ కోడ్‌ కూడా ఏర్పాటు చేశారు. కోడ్‌ను స్కాన్‌ చేసి మొక్క ప్రత్యేకతను సెల్‌ఫోన్‌లో చూసుకునేలా అందుబాటులో తీసుకొచ్చారు. దీనికితోడు గార్డెన్‌లో దాదాపు 12 లక్షల లీటర్ల నీటిని ఒడిసి పట్టేలా ట్యాంక్‌ నిర్మించారు. అలాగే సీఎం కేసీఆర్‌ పేరున ప్రత్యేకంగా 600 మొక్కలు నాటారు.

ఆయా జిల్లాల నుంచి తీసుకొచ్చిన మొక్కలు..

  • జోగుళాంబ గద్వాల జిల్లా విభాగంలో 12 రాశులకు సంబంధించిన మొక్కలు నాటారు.
  • వనపర్తి జిల్లా విభాగంలో పవిత్రవనంగా పిలిచే తెల్ల జిల్లెడు, దేవదారు, పొన్న, వేప, పారిజాతం, నాగలింగం, సీతాఅశోక, రావి, ఉసిరి మొక్కలు నాటారు.
  • నాగర్‌కర్నూల్‌ విభాగంలో అటవీ జాతులకు సంబంధించిన ఔషధ గుణాలున్న 130 జాతుల అటవీ మొక్కలు నాటారు.
  • నల్లగొండ విభాగంలో అటవీ మొక్కలు నాటారు.
  • నారాయణపేట విభాగంలో సీతాకోక చిలుకలు, తుమ్మెదలు వంటి అనేక కీటకాలను ఆకర్షించే పూల మొక్కలు నాటారు.
  • మహబూబ్‌నగర్‌ విభాగంలో మర్రి, రావి, జువ్వి, కొండ జువ్వి, కొండరావి, బండ జువ్వి, తీగమర్రి వంటి 23 రకాల మొక్కలు నాటారు.
  • వికారాబాద్‌ విభాగంలో అనేక అలంకరణ మొక్కలైన పెన్సిల్‌ఫైన్‌, క్రిస్మస్‌ ట్రీ, డ్రసీన, మొగలి వంటి మొక్కలు నాటారు.
  • సంగారెడ్డి విభాగంలో ఉసిరి మొక్కలు నాటారు.
  • మెదక్‌ విభాగంలో 27 నక్షత్రాలకు సంబంధించిన మొక్కలు వెదురు, సీత అశోక, కదంబ, మారేడు, జాతమంసి, ఇప్ప వంటి మొక్కలు నాటారు.
  • నిజామాబాద్‌ విభాగంలో కలపనిచ్చే మొక్కలైన టేకు, మహాగని, వేప, అర్జున, చిరుమాను మొక్కలు నాటారు.
  • నిర్మల్‌ విభాగంలో బహువార్షిక మొక్కలైన నిమ్మ, అరటి, మల్బరీ, కాఫీ, పోక మొక్కలు నాటారు.
  • ఆదిలాబాద్‌ విభాగంలో దాదాపు 50 రకాల పండ్ల మొక్కలు నాటారు. లాగాన్‌, ఎగ్‌ఫ్రూట్‌, లిటిచి, అవకాడో, ఆల్‌బొకర, సీతాఫలం, రమాఫలం, హనుమాన్‌ ఫలం, లక్ష్మణ ఫలం, వాటర్‌ యాపిల్‌, 10 రకాల మామిడి, జీడి మామిడి, దానిమ్మ, బొప్పాయి మొక్కలు నాటారు.
  • జగిత్యాల విభాగంలో అడవుల్లో అందంగా పూలు పూసే మొక్కలు నాటారు.
  • పెద్దపల్లి విభాగంలో కొబ్బరి, పొక, ఈత, జీలుగ వంటి 20 రకాల మొక్కలు నాటారు.
  • రాజన్న సిరిసిల్ల విభాగంలో అరుదైన వివృత బీజాల మొక్కలు నాటారు.
  • సిద్దిపేట విభాగంలో దాదాపు 220 గులాబీ మొక్కలు నాటారు.
  • మేడ్చల్‌ విభాగంలో సుగంధ ద్రవ్యాలు కలిగిన దాల్చిన, బిర్యానీఆకు, కరివేపాకు, పసుపు మొక్కలు నాటారు.
  • జనగామ విభాగంలో దాదాపు 35 ఎర్రచందనం మొక్కలు నాటారు.
  • వరంగల్‌ అర్బన్‌ విభాగంలో అరుదైన శ్రీగంధం మొక్కలు నాటారు.
  • భద్రాద్రి కొత్తగూడెం విభాగంలో అంతరించిపోతున్న ఎర్రచందనం, గాలిబుడగ, అడవిఉల్లి, ఆంద్రోగ్రఫీస్‌ మొక్కలు నాటారు.
  • రంగారెడ్డి విభాగంలో అలంకరణ మొక్కలు నాటారు.
  • కరీంనగర్‌ విభాగంలో ఎడారి మొక్కలు నాటారు. వీటితో పాటు బొటానికల్‌ గార్డెన్‌లో అనేక రకాల ఔషధ మొక్కలు, స్థానీయ జాతులను నాటారు.
- Advertisement -

ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం..
జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్‌ గార్డెన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం. గార్డెన్‌ అభివృద్ధికి ఏడా ది కిందట సీఎం కేసీఆర్‌ రూ.50 లక్షలు మంజూరు చేశారు. రూ. 10 లక్షలతో జిల్లాల వారీగా వి భాగాలు ఏర్పాటు చేసి మొక్కలు నాటాం. మిగతా డబ్బుతో జిల్లా ల వారీగా మధ్యలో అంతర్గత రహదారులు, మొక్కల సంరక్షణకు నెట్‌హౌజ్‌ ఏర్పాటు చేయనున్నాం. అదే విధంగా పరిశోధన ల్యాబ్‌, కంప్యూటర్లు, మైక్రోస్కోప్‌ ఏర్పాటు చేయనున్నాం. కళాశాల ప్రిన్సిపాల్‌ అప్పియ్య చిన్నమ్మతో పాటు త్రిసభ్య కమిటీ సభ్యుల సహకారంతో గార్డెన్‌ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. వచ్చే ఏ డాదికల్లా పూర్తిస్థాయిలో గార్డెన్‌ రూపుదిద్దుకుంటున్నది.

  • డాక్టర్‌ సదాశివయ్య, గార్డెన్‌ సమన్వయకర్త
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana